Asianet News TeluguAsianet News Telugu

మేమొచ్చిన రెండేళ్లకే రోడ్లు పాడయ్యాయి.. టీడీపీ అవినీతి ఇది : బొత్స సత్యనారాయణ

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై (telugu desam party) విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satya narayana). తమ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లకే టీడీపీ (tdp) హయాంలో వేసిన రోడ్లన్నీ (roads) పాడయ్యాయని అన్నారు. దీనిని బట్టి టీడీపీ పాలనలో ఎంత దోపిడీ, అవినీతి జరిగిందో అర్థమవుతుందని దుయ్యబట్టారు. 

minister botsa satyanarayana slams tdp over roads damage
Author
Amaravathi, First Published Jan 19, 2022, 8:45 PM IST

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై (telugu desam party) విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satya narayana) . బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన... తమ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లకే టీడీపీ (tdp) హయాంలో వేసిన రోడ్లన్నీ (roads) పాడయ్యాయని అన్నారు. దీనిని బట్టి టీడీపీ పాలనలో ఎంత దోపిడీ, అవినీతి జరిగిందో అర్థమవుతుందని దుయ్యబట్టారు. ఒక కొత్త రోడ్డుకు ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు కాలపరిమితి ఉంటుందని బొత్స చెప్పారు.

టీడీపీ వాళ్లు వేసిన రోడ్లు పాడైపోయినప్పటికీ ప్రపంచ బ్యాంకు (world bank) సాయంతో తూర్పుగోదావరి జిల్లాలో రోడ్లు వేసేందుకు టెండర్లను ఆహ్వానించామని సత్యనారాయణ గుర్తుచేశారు. కాకినాడ శివారు ప్రాంతాలకు తాగునీటి సమస్యను తీరుస్తామని మంత్రి చెప్పారు. త్వరలో జరిగే కొన్ని మున్సిపల్ ఎన్నికలకు గ్రామాల విలీన సమస్య ఉందని, అయితే వీటిపై కొందరు కోర్టును ఆశ్రయించారని సత్యనారాయణ తెలిపారు. వాటిని వెకేట్ చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని బొత్స చెప్పారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (amaravati) పరిధిలోకి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు వైసిపి సర్కార్ సిద్దమైన సంగతి తెలిసిందే. అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (amaravati capital city municipal carporation) ఏర్పాటుకు ఇటీవల జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అమరావతి పరిధిలోని 19 గ్రామాలను కలుపుకుని నగరపాలక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఇటీవలే నోటిఫికేషన్ కూడా విడుదల చేసారు. ఈ క్రమంలోనే కార్పోరేషన్ పరిధిలోకి వచ్చే గ్రామాల  ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. 

గత బుధవారం నుండి వారం రోజుల పాటు అమరావతి నగరపాలక సంస్థ  ఏర్పాటుకు ప్రతిపాదించిన గ్రామాల్లో గ్రామసభలు జరగనున్నాయి. ఈరోజు కురగల్లు (kuragallu), నీరుకొండ (neerukonda) గ్రామాల్లోగ్రామసభ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు అధికారులు. ముందుగా  ప్రభుత్వ ప్రతిపాదనను గ్రామస్తులకు తెలిపి వారి అభిప్రాయాలను సేకరించడమే కాదు అభ్యంతరాలను కూడా అధికారులు నమోదు చేసుకోనున్నారు.    

మంగళగిరి (mangalagiri) మండలంలో 3 గ్రామాలు,తుళ్లూరు మండలంలో 16 గ్రామాలను కలిపి అమరావతి నగరపాలక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి నగరపాలక సంస్ధ ఏర్పాటుపై అభిప్రాయాలను సేకరించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios