సీపీఎస్‌ రద్దు కోరుతూ  సీఎంవో ముట్టడికి యూటీఎఫ్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చలో సీఎంవో నిర్వహించకుండా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. అయితే ఉపాధ్యాయులు చలో సీఎంవోకు ముట్టడికి పిలుపునివ్వడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

సీపీఎస్‌ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చలో సీఎంవో నిర్వహించకుండా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. చలో సీఎంవోకు అనుమతి లేదంటున్న పోలీసులు.. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని దారులను మూసివేశారు. ఉపాధ్యాయులు ఎవరూ తాడేపల్లి వైపు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడే వారిని అడ్డుకుంటున్నారు. అయితే ఉపాధ్యాయులు చలో సీఎంవోకు ముట్టడికి పిలుపునివ్వడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

సోమవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్‌పై ప్రభుత్వం కమిటీ వేసిందని చెప్పారు. కమిటీ అధ్యయనం తర్వాత సీపీఎస్‌పై స్పష్టత వస్తుందన్నారు. ఈలోపే ఉపాధ్యాయులు సీఎంవో ముట్టడిస్తానని చెప్పడం ధర్మమేనా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సీఎం ఇంటిని ముట్టడిస్తామని అనడం సరికాదని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగొంచదని ఉపాధ్యాయులను కోరారు. ఆందోళనలో జరగరానిది జరిగితే ఎవరూ బాధత్య వహిస్తారని ప్రశ్నించారు. 

ప్రతి అంశాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. విద్యా శాఖలో సంస్కరణలు దశలు వారీగా వస్తాయన్నారు. 55 వేల ప్రభుత్వ స్కూళ్లను నాడు నేడు ద్వారా అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. ఉన్నత విద్యకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. 

ఇక, యూటీఎఫ్ చలో సీఎంవో పిలపు నేపథ్యంలో.. తాడెప‌ల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు ఎవ‌రూ అడుగుపెట్టకుండా పోలీసులు మొత్తం 5 అంచెల భ‌ద్ర‌త వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశారు. దాదాపు 52 చోట్ల చెక్ పోస్ట్ ల‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని నిలువ‌రిచేందుకు 1000 మంది పోలీసుల‌ను ఉప‌యోగిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని పోలీసుల‌తో పాటు ఇత‌ర జిల్లా పోలీసుల‌ను తాడెప‌ల్లిగూడెంకు ర‌ప్పించుకున్నారు. సివిల్,ఏఆర్, ఆక్టోప‌స్ వంటి ప్ర‌త్యేక బ‌ల‌గాల‌కు అక్క‌డ విధులు కేటాయించారు. 

ఈ ముట్ట‌డిని భ‌గ్నం చేసేందుకు ఆదివారం నాటి నుంచే పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మ‌ఫ్టీలో తిరుగుతూ వాహ‌నాలు చెక్ చేస్తూ అనుమానం వ‌చ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ముందుగానే నిర‌స‌నకారుల‌ను, ఆందోళ‌న వ్య‌క్తం చేసే అవ‌కాశం ఉన్న వారిని గుర్తించి సమీపంలోని పోలీసు స్టేష‌న్ ల‌కు తీసుకెళ్లారు. ప‌లు ఉపాధ్యాయ సంఘాల నాయ‌కుల‌ను కూడా ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. క్యాంపు ఆఫీసు వైపు ముట్టడి కోసం తరలివస్తున్న వారిని ఎక్కడికక్కడే అరెస్ట్‌లు చేస్తున్నారు.