ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఛలో విజయవాడకు తరలివచ్చి ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satya narayana) స్పందించారు. ఉద్యోగులు చర్చలకు రాకుండా ఆందోళనలు చేపట్టడం సరికాదన్నారు. ఉద్యోగుల జీతాలను ఇప్పటికే ప్రాసెస్ చేశామని, ఈ దశలో జీతాలు ఆపాలని కోరడం సరికాదని బొత్స సత్యనారాయణ హితవు పలికారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఛలో విజయవాడకు తరలివచ్చి ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satya narayana) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చర్చలకు మంత్రుల కమిటీ ఎప్పుడూ సిద్ధంగానే ఉందని, కానీ ఉద్యోగులు చర్చలకు రాకుండా ఆందోళనలు చేపట్టడం సరికాదన్నారు. ఉద్యోగుల జీతాలను ఇప్పటికే ప్రాసెస్ చేశామని, ఈ దశలో జీతాలు ఆపాలని కోరడం సరికాదని బొత్స సత్యనారాయణ హితవు పలికారు.
పీఆర్సీ అమలులో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. ఉద్యోగులు చర్చలకు వచ్చి ఉంటే సమస్యలు ఎప్పుడో పరిష్కారం అయ్యేవని బొత్స సత్య నారాయణ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా చర్చలకు అవకాశం ఉందని, ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యల తెలుసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల నిరసన ప్రదర్శనలపై ప్రభుత్వం, పోలీసులు సంయయనంతో వ్యవహరించినట్టు బొత్స తెలిపారు. అయితే తాము కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరినట్లు మంత్రి పేర్కొన్నారు.
అటు కొత్త రాష్ట్రం అయినప్పటికీ తాము అధికారంలో వుండగా ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని చంద్రబాబు ప్రకటించడంపైనా బొత్స మండిపడ్డారు. ఉద్యోగులను చంద్రబాబు ఉద్ధరించింది ఏంటంట? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కంటే మిన్నగా ఉద్యోగులకు లబ్ది చేకూర్చామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
అలాగే ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. చర్చలకు అవకాశం ఇవ్వలేదనడం అబద్ధమని.. హౌస్ అరెస్ట్‌లు లేవని, అనుమతి లేని సభకు వెళ్లొద్దని చెప్పామని సుచరిత తెలిపారు. ఉద్యోగులు సహకరించాలని సీఎం జగన్ (jagan) చెప్పారని.. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని హోంమంత్రి స్పష్టం చేశారు. కరోనాతో రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులున్నాయని ఆమె అన్నారు.
అంతకుముందు చలో విజయవాడ (chalo vijayawada) కార్యక్రమంపై స్పందించారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . ఉద్యోగుల నిరసనలపై జగన్ (ys jagan) ప్రభుత్వ నియంతృత్వ తీరును ఆయన ఖండించారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా.. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సిఎం జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం రివర్స్ పిఆర్సిని (prc) వెనక్కి తీసుకోవాలి.....నియంతృత్వం వీడి పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షల మంది సమస్యపై అహంకారంతో కాకుండా...ఆలోచనతో స్పందించాలని, ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా అని చంద్రబాబు నిలదీశారు.
