వైసీపీని విమర్శించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇప్పటం సభలో తమపై చేసిన వ్యాఖ్యలకు బొత్స కౌంటరిచ్చారు. పవన్‌వి దిగజారుడు రాజకీయాలంటూ ఫైరయ్యారు. 

జనసేన (janasena) ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ (pawan kalyan) వైసీపీ (ysrcp) ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana). వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పవన్ సినిమా డైలాగులు చెబుతున్నారని.. వైసీపీ విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని బొత్స ఫైరయ్యారు. పవన్ ప్రజా సమస్యలపై మాట్లాడితే బాగుండేదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే వుండాలని సీఎం జగన్ నిర్దేశించారని చెప్పారు. 

కేడర్‌ను ప్రజలకు దగ్గర చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పవన్ కల్యాణ్ ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లాలని జగన్ (ys jagan) సూచించారని బొత్స తెలిపారు. మూడేళ్లలో ప్రభుత్వం చేసిన ప్రతి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ సూచించారని సత్యనారాయణ పేర్కొన్నారు. 

అంతకుముందు పవన్ విమర్శలకు మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటరిచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో ఉంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ది తెలుస్తుందన్నారు.ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మినహా పవన్ కు ఏం తెలుసునని మంత్రి అడిగారు. BJPతో పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ ఏం సాధించారని ప్రశ్నించారు. గతంలో TDPతొ పొత్తు నుండి పవన్ కళ్యాణ్ ఎందుకు బయటకు వచ్చారని ప్రశ్నించారు. 

ఇప్పుడు టీడీపీతో ఎందుకు కలుస్తాను అంటున్నారని పవన్ కళ్యాణ్ అడిగారు.Chandrababuను సీఎంగా చేయడం కోసం పవన్ కళ్యాణ్ పార్టీని పెట్టారా అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ సెటైర్లు వేశారు.పవన్ కళ్యాణ్ కు సినిమాల్లో సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ తప్పుడు మార్గంలో నడుస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ కు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. 

Kakinada ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై జనసేన కార్యకర్తలు దాడి చేస్తే వైసీపీ కార్యకర్తలు ప్రతి దాడి చేశారని మంత్రి వివరించారు. అందరూ తన మాదిరిగా ఉండరని ఆయన చెప్పారు.ఈ విషయాలు తెలియకుండా నిన్న సభలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం అర్ధ రహితమన్నారు. తాను ఎలాంటి వ్యక్తో నాగబాబుకు తెలుసునని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.