తనపై తప్పుడు ప్రచారం చేసిన మీడియా ఛానెళ్లు, టీడీపీ నాయకులకు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి లీగల్ నోటీసులు  పంపారు. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం తమిళనాడులో తనకు సంబంధించిన డబ్బు దొరికిందంటూ కొన్ని ఛానెళ్లలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో తనపై లేనిది కల్పించి తప్పుడు వార్తలను ప్రచారం చేయించారంటూ బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బొండా ఉమా, కొమ్మారెడ్డి పట్టాబీతో పాటు టీవీ-5, న్యూస్ 18 ఛానళ్లకు మంత్రి లీగల్ నోటీసులు  పంపారు.

పట్టుబడ్డ రూ.5 కోట్లు తమవేనంటూ ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమిల్లి బాలు ప్రకటించారు. అయినప్పటికీ ఇవేవీ పట్టించుకోకుండా తనపై ఆరోపణలు చేయడంతో మంత్రి బాలినేని న్యాయపోరాటానికి దిగారు.

Also Read:ఆ డబ్బు నాదని నిరూపిస్తే రాజీనామా, టీడీపీ లేకుండా చేస్తా: మంత్రి బాలినేని సంచలనం

తమిళనాడులో దొరికన డబ్బులు తనదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని కొద్దిరోజుల క్రితం ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన క్యారెక్టర్ గురించి ప్రజలకు తెలుసునన్నారు. టీడీపీ అబాండాలు వేయడం సరైంది కాదన్నారు.

తమిళనాడులో పట్టుబడిన నగదుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ డబ్బులు తనకు చెందినవని బంగారం వ్యాపారి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు చేసిన లోకేష్ ఈ ఆరోపణలను నిరూపించాలని ఆయన కోరారు. లేకపోతే లోకేష్ క్షమాపణ చెప్పాలన్నారు.