Asianet News TeluguAsianet News Telugu

అందుకే ఏకగ్రీవాలు జరగాలి: మంత్రి బాలినేని కామెంట్స్

త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. 

minister balineni srinivasa reddy comments on panchayat elections ksp
Author
Ongole, First Published Jan 28, 2021, 5:46 PM IST

త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గురువారం ప్రకాశం జిల్లా పార్టీ కార్యాలయంలో నేతలతో భేటీ నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ఏవైనా తమ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందని బాలినేని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయని శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Also Read:చంద్రబాబు స్పూర్తితో నిమ్మగడ్డ పనిచేస్తున్నారు: అంబటి విమర్శ

జిల్లాలో ఏకగ్రీవాలపై దృష్టి సారించాలని నాయకులకు బాలినేని పిలుపునిచ్చారు. గ్రామాల ప్రగతికి తోడ్పడతాయని తాము ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంటే.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌, చంద్రబాబు అండ్‌ కో అసత్య ప్రచారం చేస్తున్నాయని బాలినేని ఆరోపించారు.

ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఆయన ఆరోపించారు.

గతంలో ఆగిన ఎన్నికలను పూర్తి చేయకుండా పంచాయతీ ఎన్నికలను నిర్వహించడమేంటని రమేష్ కుమార్‌ను మంత్రి ప్రశ్నించారు. చీరాల ప్రాంతంలో కోర్టు కేసులు ఉండటం వల్ల అక్కడ ఎన్నికలు జరగడం లేదని బాలినేని స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios