వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్రమంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ తనపై అవినీతి ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్టణం: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్రమంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ తనపై అవినీతి ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేస్తున్నఆరోపణలను ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. 

రాజకీయ వ్యవస్ధ చెడిపోయిందని జగన్ పదేపదే అనడం దురదృష్టకరమన్నారు. రాజకీయ వ్యవస్ధను భ్రష్టుపట్టించింది వైఎస్ జగన్ కాదా అని మంత్రి ప్రశ్నించారు. జగన్ లాంటి నేతల వల్ల రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై దుష్ప్రచారం చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారని, అవినీతిని నిరూపించకుండా గాలిమాటలు మాట్లాడుతున్నారన్నారు. బురదలో కూరుకుపోయిన జగన్ మాపై బురదజల్లే ప్రయత్నం చేయడం తగదని హితవు పలికారు.