ఆంధ్రా మంత్రి అయ్యన్న రాజీనామా... నిజమేనా?

Minister Ayyannapatrudu not satisfy on wrong publicity in social media
Highlights

గంటాకు అయ్యన్న సవాల్


విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య ప్రచ్చన్నయుద్దం సాగుతోంది. గంటా తీరుతో మంత్రి అయ్యన్నపాత్రుడు అసంతృప్తితో ఉన్నారని
ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు.

 
అధికారుల బదిలీలతో పాటు, పార్టీలో కూడ  తన వ్యతిరేక వర్గీయులకు పాధాన్యత ఇవ్వడంపై గంటా తీరుతో అయ్యన్నపాత్రుడు తీవ్ర  అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది.

విశాఖ జిల్లా  పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్  కోటేశ్వర్ రావు, ఈవో సూర్యప్రకాష్‌లు బదిలీ అయ్యారు. అయితే వారిని తిరిగి జిల్లాలోనే నియమించుకోవడం వెనుక మంత్రి గంటాశ్రీనివాసరావు  చక్రం తిప్పారని మంత్రి అయ్యన్న తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ప్రచారంలో ఉంది.


ఈ విషయమై ఒకానొక దశలో మంత్రి అయ్యన్నపాత్రుడు రాజీనామాకు కూడ సిద్దమయ్యారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. అయితే ఈ ఆరోపణలపై మంత్రి
అయ్యన్నపాత్రుడు స్పందించారు. తాను రాజీనామా చేస్తానని కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. రాజకీయగా తనను ఎదుర్కొనే శక్తి లేకే సోషల్
మీడియా వేదికగా కొందరు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అయ్యన్నపాత్రుడు చెప్పారు.పశుసంవర్థక శాఖ వివాదం ఎప్పుడో సమసిపోయిందన్నారు మంత్రి
అయ్యన్నపాత్రుడు.దమ్ముటే తనను రాజకీయంగా ఎదుర్కోవాలని ఆయన డిమాండ్ చేశారు.

loader