Asianet News TeluguAsianet News Telugu

ఔను వాళ్లు ఒక్కటయ్యారు:ఒకే వేదికపై అన్న,తమ్ముడు,కొడుకు

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. అది ఎంత వరకు నిజమో అన్నది తెలియదు కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు మాత్రం అవి నిజమేనని నిరూపిస్తున్నాయి. రాజకీయాల్లో దక్షిణ ఉత్తర ధృవాలుగా ఉండే కాంగ్రెస్ టీడీపీలు ఏకమవ్వగా లేనిది ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరన్నదమ్ములు,కొడుకు ఏకం కాలేరా. అంటే ఎందుకు కాలేరు అన్నట్లు సమాధానమిచ్చారు ఆ అన్నదమ్ములు. 

minister ayyanna patrudu, sanyasipatrudu, vijay on one stage
Author
Visakhapatnam, First Published Nov 12, 2018, 6:02 PM IST

విశాఖపట్నం: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. అది ఎంత వరకు నిజమో అన్నది తెలియదు కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు మాత్రం అవి నిజమేనని నిరూపిస్తున్నాయి. రాజకీయాల్లో దక్షిణ ఉత్తర ధృవాలుగా ఉండే కాంగ్రెస్ టీడీపీలు ఏకమవ్వగా లేనిది ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరన్నదమ్ములు,కొడుకు ఏకం కాలేరా. అంటే ఎందుకు కాలేరు అన్నట్లు సమాధానమిచ్చారు ఆ అన్నదమ్ములు. 

తాము కలిసిపోయినట్లు స్టేజ్ పై కూర్చొని మరీ ఫోటోలకు ఫోజులిచ్చారు. అన్నదమ్ముల మధ్య ఓ ఎమ్మెల్యే వచ్చి కూర్చుంటే ఆమెను పక్కకు తప్పించి మరీ తమ్ముడిని తన పక్కన కూర్చోబెట్టుకుని ప్రేమ కురిపించారు అన్నయ్య. ఒకవైపు తమ్ముడు మరోవైపు  కొడుకు మధ్యలో అన్నయ్య.ఇంకేముంటుంది విడిపోయారనుకున్న కుటుంబం ఒకే వేదికపై దర్శనమిస్తే అభిమానులు ఊరుకుంటారా..ఫోటోలో బంధించేయ్యరు. 

ఇంతకీ ఆ అన్నదమ్ములు ఎవరు..? ఎందుకు విడిపోయారు..? మళ్లీ ఎందుకు కలిశారు..? వాళ్ల మధ్య వచ్చిన గొడవలేంటని తెలుసుకోవాలని ఉందికదా ఇంకెందుకు ఆలస్యం ఓసారి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం వెళ్లొద్దాం. 

ఆ అన్నదమ్ములు మరెవరో కాదు మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సోదరుడు నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఈ అన్నదమ్ములిద్దరూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం కలిసి శ్రమించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అన్నదమ్ములిద్దరూ కలిసే ఉండేవారు. అయితే మంత్రిగారి తనయుడు విజయ్ అన్నదమ్ములిద్దరి మధ్య చిచ్చుపెట్టారు. 

ప్రతిపక్ష పార్టీలపై మాటల తూటాలు పేల్చే చింతకాయల విజయ్ తన రాజకీయ భవిష్యత్ పై మార్గం సుగమం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. తండ్రి తర్వాత తానే రాజకీయ వారసుడిగా ప్రకటించుకుందామని భావించిన విజయ్ కు బాబాయ్ సన్యాసిపాత్రుడు కంటిలో నలుసులా కనిపించారో ఏమో కానీ బాబాయ్ తో లడాయికి దిగాడు. 

బాబాయ్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా, పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా పార్టీ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటుడంతో అందుకు ప్రతిగా విజయ్ తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బాబాయ్ సన్యాసిపాత్రుడు గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే అబ్బాయ్ మాత్రం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. 

అబ్బాయి వ్యవహారంపై బాబాయ్ కు  చిర్రెత్తుకొచ్చిన బాబాయ్ సన్యాసిపాత్రుడు ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. పట్టణ అధ్యక్షుడి హోదాలో విజయ్ పై ఫిర్యాదు చేశారు. తనను సంప్రదించకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారంటూ పేర్కొన్నారు. 

పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి విజయ్ కు ఎలాంటి పదవి లేదని అయినా పార్టీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ లేఖ రాశారు. ఆ లేఖలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలకలం రేపాయి. అయితే బాబాయ్ అబ్బాయ్ ల మధ్య వివాదం మంత్రి అయ్యన్నపాత్రుడికే వదిలేసినట్లు సమాచారం. 

అన్ని సమస్యలను పరిష్కరించే అయ్యన్నపాత్రుడు ఇంటి సమస్యలను పరిష్కరించడం పెద్ద తలనొప్పిగా మారింది. అటు చూస్తే రక్తం పంచుకుపుట్టిన తమ్ముడు, ఇటు చూస్తే కన్న కొడుకు ఇలా ఎటువైపు వెళ్తే ఎవరు దూరమవుతారోనని ఆందోళన చెందారు. అయ్యన్న కుటుంబలో కలహాలు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

ఈ ప్రచారం తన రాజకీయ భవిష్యత్ కు చాలా ఇబ్బంది అని అయ్యన్నపాత్రుడు భావించాడు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న తనకు ఈ సమస్య పెద్ద తలనొప్పిగా మారిందని కార్యకర్తల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.    

అయితే నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగే రాజకీయ సభలకు, సమావేశాలకు పార్టీ కార్యక్రమాలకు ముగ్గురు కలిసి పాల్గొన్న పరిస్థితి లేదు. ముగ్గురిని ఒకే వేదికపై చూడాలని అభిమానులు భావించినా ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. 

అయితే ఎట్టకేలకు ఈ ముగ్గురు పెద్దబొడ్డేపల్లి గురుకుల పాఠశాలలో కలిశారు. గురుకుల పాఠశాలలో ప్రభుత్వం నిర్వహించిన పేదరికంపై గెలుపు కార్యక్రమానికి ముగ్గురు నేతలు పాల్గొన్నారు. జ్యోతిప్రజ్వలన సమయంలో మంత్రి అయ్యన్నపాత్రుడు తన తమ్ముడు సన్యాసిపాత్రుడును జ్యోతిప్రజ్వలన చెయ్యాలని సూచించారు.  

జ్యోతిప్రజ్వలన అనంతరం వేదికపై ఆశీన్నులుకాగా మంత్రికి ఎడమవైపు కుమారుడు విజయ్ కుడివైపు పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆ తర్వాత ఆయన సోదరుడు సన్యాసినాయుడు కూర్చున్నారు. అయితే మంత్రి అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే అనితను అటువైపుకు పింపించి సోదరుడు సన్యాసిపాత్రుడుని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. 

అలా మంత్రి అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు ఒకే వేదికపై కూర్చోవడంతో అంతా కలిసిపోయారని కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి ఇరువైపులా తనయుడు, సోదరుడు కూర్చోవడంతో అభిమానులు తమ ఫోన్లో వారిని బంధించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

బాబాయ్ అబ్బాయ్ ల మధ్య లడాయి:మంత్రి అయ్యన్నకు తలనొప్పి

Follow Us:
Download App:
  • android
  • ios