జగన్ గారు చర్చకు సిద్ధమా..?

minister atchannaidu challenge to YS Jagan
Highlights

జగన్ గారు చర్చకు సిద్ధమా..?

వైసీపీ  అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి అచ్చెన్నాయుడు ఓ సవాల్ విసిరారు.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోన విదేశీ విద్యా దీవెన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమానికి హాజరైన అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ హయాంతో బీసీలకు అన్యాయం జరిగిందని ప్రతిపక్షనేత మాట్లాడుతున్నారని.. గత నాలుగేళ్లలో బీసీల కోసం రూ. 16 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో వారికి రూ. 7 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు..

అసలు ఎవరి హయాంలో బీసీలకు న్యాయం జరిగిందో తేల్చేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అని జగన్‌కు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ఎప్పుడైనా, ఎక్కడైనా తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి అన్నారు. సీఎం చంద్రబాబు పేదల పక్షపాతి అని అభివర్ణించారు. ఇదే కార్యక్రమంలో కాపు కార్పోరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ... డబ్బున్న వారే కాకుండా పేదలు కూడా బాగా చదువుకోవాలనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి విదేశీ విద్యాదీవెన పథకాన్ని రూపొందించారన్నారు.. ఈ పథకానికి ఎంపికైన వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు వీసా,  విమాన ఖర్చులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సుబ్బారాయుడు వెల్లడించారు.

loader