Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను అడ్డుకుంటే.. ఉత్తరాంధ్ర ఉద్యమిస్తుంది: అమరావతి రైతులపై మంత్రి వ్యాఖ్యలు

ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి అప్పలరాజు (minister appalaraju) సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను అమరావతి రైతులు అడ్డుకుంటే .. ఉత్తరాంధ్ర ఉద్యమిస్తుందన్నారు మంత్రి అప్పలరాజు. ప్రభుత్వం మూడు ప్రాంతాలకు సమన్యాయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

minister appalaraju sensational comments on vizag executive capital
Author
Amaravathi, First Published Dec 16, 2021, 4:34 PM IST | Last Updated Dec 16, 2021, 4:35 PM IST

ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి అప్పలరాజు (minister appalaraju) సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను అమరావతి రైతులు అడ్డుకుంటే .. ఉత్తరాంధ్ర ఉద్యమిస్తుందన్నారు మంత్రి అప్పలరాజు. ప్రభుత్వం మూడు ప్రాంతాలకు సమన్యాయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని మంత్రి ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని చంద్రబాబు చూడక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. 

అంతకుముందు మంత్రి బొత్స సత్యనారాయణ ఇదే విషయంపై మాట్లాడుతూ.. మూడు ప్రాంతాల అభివృద్ది మా విధానమని దానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. గురువారం నాడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.Amaravati  కాదు అన్ని ప్రాంతాల అభివృద్ది జరగాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని ఆయన అన్నారు. రేపు తిరుపతిలో జరిగేది Tdp  రాజకీయ సభ అని ఆయన తేల్చి చెప్పారు. ఆ 29 గ్రామాలు, ఆ సామాజిక వర్గమే టీడీపీకి ప్రధానమని బొత్స సత్యనారాయణ విమర్శించారు. రైతుల యాత్రలో పాల్గొనే వారంతా టీడీపీ వారేనని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని టీడీపీ విమర్శలను ఆయన తప్పుబట్టారు.  అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడమంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమా అని ఆయన ప్రశ్నించారు. 

Also Read:టీడీపీ రాజకీయ సభే, బీజేపీ ఎందుకు స్టాండ్ మార్చుకొంది: తిరుపతి సభపై బొత్స సెటైర్లు

Chandrababu ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైద్రాబాద్ ను మాత్రమే అభివృద్ది చేశారన్నారు. చంద్రబాబు  తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ది చేశాడన్నారు. నాగార్జున సాగర్, పోలవరం కట్టడానికి వేల మంది రైతులు భూములు ఇచ్చారన్నారు. వారిది త్యాగం కాదా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఒక సామాజిక వర్గం అభివృద్ధి చెందడం త్యాగమా? అని అడిగారు.

తాము అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు కి ఒక అజెండా, దోపిడీ కార్యక్రమం ఉందన్నారు.ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ కాపిటల్ వద్దని Atchannaiduకి ఎవరు చెప్పారన్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం, జాతి సంపాదని దోచుకుంటూ త్యాగం అంటున్నారని ఆయన విమర్శించారు.Tirupati సభలో  వైసీపీ వాళ్ళు ఆల్లర్లు సృష్టిస్తారు అని అచ్చెన్నాయుుడు అంటున్నారన్నారు. మీరే అల్లర్లు సృష్టించేలా వున్నారని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. అమరావతి లో అవినీతి జరిగింది అని ప్రధాని మోడీ చేసిన ప్రకటనను మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. రాజకీయ ఉద్దేశాల తో Bjp  నేతలు స్టాండ్ మార్చుకున్నారని ఆయన సెటైర్లు వేశారు.Jana sena  పగలు ఎవరితో వుంటారు, రాత్రి ఎవరు తో ఉంటారో తెలిసిందేన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios