Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఆముల్ బేబీ అయితే...నువ్వు హెరిటేజ్ దున్నపోతువా: లోకేశ్‌పై అనిల్ కుమార్ సెటైర్లు

ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పోలవరం పనులు కొనసాగుతున్నాయన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎదో ఒక రకంగా దాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. 

minister anil kumar  yadav satires on tdp leader nara lokesh ksp
Author
Amaravathi, First Published Jun 10, 2021, 3:45 PM IST

ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పోలవరం పనులు కొనసాగుతున్నాయన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎదో ఒక రకంగా దాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అది పూర్తి అయితే సీఎం జగన్‌కు, వైఎస్సార్ కి మంచి పేరు వస్తుందని వారి భయమంటూ అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. అందుకే రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు.

ఈ కోవిడ్ పరిస్థితుల్లో కార్మికులు, ఇంజనీర్లు చనిపోయారని అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.  చినబాబు ఫ్రస్టేషన్ పీక్స్ కి వెళుతోందని... మూడు శాఖలకు మంత్రిగా చేసినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడంటూ సెటైర్లు వేశారు. ఉన్న ఎమ్మెల్సీ కూడా ఓ ఏడాదిలో పూర్తి అయిపోతుందని.. అందుకే బయట తిరగలేక ఇంట్లో కూర్చుని జూమ్ లో జగన్ గురించి మాట్లాడుతున్నాడంటూ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.

Also Read:ప‌రిశ్ర‌మ‌ చంద్ర‌బాబుది... ప్ర‌చారం జ‌గ‌న్‌ది... సొమ్మొక‌డిది సోకొక‌డిది: లోకేష్ సీరియస్

వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేశ్‌కు ఒక్క శాతమైనా ఉందా అని మంత్రి ప్రశ్నించారు. మా తాత సీఎం, మా నాన్న సీఎం అని చెప్పుకున్నా నువ్వు గెలవలేక పోయావంటూ అనిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనుచూపు మేరలో నీ పార్టీ జగన్ సంక్షేమ పథకాలతో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. జగన్ ఆముల్ బేబీ అయితే...నువ్వు హెరిటేజ్ దున్నపోతువా అంటూ సెటైర్లు వేశారు. మాటలు నీకే కాదు...మాకు వచ్చుంటూ హెచ్చరించారు.

గూగుల్ కొడితే నీ పేరు పప్పు అని వచ్చిందని.. నువ్వు గడ్డం పెంచగానే ఎదో జరగదని ధైర్యం బై బర్త్ బ్లడ్ లో ఉండాలంటూ అనిల్ కుమార్ హితవు పలికారు. ఆత్మగౌరవం లేక హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారని.. ఏ మాత్రం ఆంధ్ర ప్రజలపై ప్రేమ ఉన్నా గత ఐదేళ్లలో ఏపీలో ఇల్లు కట్టుకునే వాడంటూ ఎద్దేవా చేశారు. పునరావాసం విషయములో అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. 2022 ఖరీఫ్ నాటికీ తప్పనిసరిగా సాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండా కాపర్ డ్యామ్ ఎలా కడతారని అనిల్  కుమార్ ప్రశ్నింనచారు. వీళ్ళు చేసిన తప్పులను మాపై రుద్దాలని చూస్తున్నారని... సీఎం పోలవరం కోసం రావాల్సిన నిధుల విషయంపై ఢిల్లీలో చర్చిస్తారని వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios