ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అక్కడ అధికారులను అడిగి పనుల పురోగతిని సీఎం తెలుసుకున్నారు. ఈ వివరాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాకు తెలిపారు.

2021 జూన్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు . కాపర్ డ్యాం నిర్మాణం, పునరావాసంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారని మంత్రి తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పోలవరాన్ని వేగంగా పూర్తి చేస్తామని అనిల్ కుమార్ వెల్లడించారు.

మరో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా జగన్ పోలవరం పర్యటన సాగిందన్నారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో పక్కా టైం షెడ్యూల్‌తో ముందుకు వెళతారని కన్నబాబు వెల్లడించారు.