ప్రత్యర్థి పార్టీలు, నాయకులపై సెటైర్లు వేయడంలో మంత్రి అంబటి రాంబాబు స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. తాజాగా ఆయన చంద్రబాబు విసిరిన సవాల్ కు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.
గుంటూరు : ఎన్నికల వేల ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి-జనసేన కూటమి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. సవాళ్ళు ప్రతిసవాళ్లు...మాటకు మాట... వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాటల ఘాటు పెంచారు. చొక్కాలు మడతపెడతామని ఒకరంటే... కుర్చీ మడతపెడతామని మరొకరు సినిమా స్టైల్లో డైలాగ్స్ కొడుతూ ఎలక్షన్ హీట్ ను మరింత పెంచుతున్నారు. పార్టీల అధినేతలే ఇలా సై అంటుంటే లీడర్లు, క్యాడర్ సైసై అనకుండా వుంటారా... మంత్రి అంబటి రాంబాబు లాంటివారు అస్సలు ఊరుకోరు. ఇలా చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఏం మాట్లాడినా అంబటి కౌంటర్ ఇస్తుంటారు. ఇలా తాజాగా చంద్రబాబు విసిరిన సవాల్ పై కూడా అంబటి రాంబాబు సెటైర్లు వేసారు.
జగన్ రెడ్డీ ...ప్లేస్, డేట్ నువ్వే నువ్వే ఫిక్స్ చెయ్యి... ఏ అంశంపై చర్చించడానికైనా నేను సిద్దమే... అంటూ ముఖ్యమంత్రికి చంద్రబాబు సవాల్ విసిరారు. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! అని జగన్ కు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరితే మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. ''డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుంది చంద్రబాబు సవాల్ !'' అంటూ టిడిపి అధినేతపై సెటైర్లు వేసారు.
ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు విసరడంలో అంబటి రాంబాబు దిట్ట... అందువల్లే ఎవరి పరువయినా తీయాలనుకుంటే ఆయనతోనే మాట్లాడిస్తుంది వైసిపి అదిష్టానం. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే మంత్రి ఎప్పటికప్పుడు కౌంటర్స్ ఇచ్చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో అంబటి మరింత దూకుడు పెంచి ప్రతిపక్ష పార్టీలు, నాయకులపై సెటైర్లు ఎక్కువచేసారు.
Also Read ప్లేస్ టైం నువ్వే డిసైడ్ చెయ్ ... సిద్ధమేనా జగన్ రెడ్డీ!: బాలయ్య స్టైల్లో చంద్రబాబు ఛాలెంజ్
ఇటీవల చంద్రబాబు కుర్చీ మడతపెడతామని ... నారా లోకేష్ కుర్చీ మడతపెట్టి చూపించడంపై కూడా అంబటి రాంబాబు తనదైన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ''ఇక్కడ ఉన్నది 'సింహాసనం'... కుర్చీ కాదు మడత పెట్టటానికి! ముందు నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్! కుర్చీ సంగతి తరువాత'' అంటూ ఎద్దేవా చేసారు అంబటి. అంతేకాదు ''సంకారావు కాదురా బాబో... అది శంకారావ! తెలుసుకో!'' అంటూ లోకేష్ మాటతీరును మంత్రి అంబటి వెక్కిరించారు.
