Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ-జనసేన పొత్తు అట్టర్ ఫ్లాపే.. పవన్‌కు మల్టి పర్సనాలిటీ డిజార్డర్ : అంబటి రాంబాబు

చంద్రబాబు కుటుంబం కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ బాధపడుతున్నారని చురకలంటించారు మంత్రి అంబటి రాంబాబు . చంద్రబాబును సీఎంను చేయడమే పవన్ లక్ష్యమన్నారు. టీడీపీ, జనసేన పొత్తును ఆ పార్టీ శ్రేణులే ఆహ్వానించలేదని.. పవన్ ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 

minister ambati rambabu key comments on tdp janasena aliance ksp
Author
First Published Sep 17, 2023, 6:40 PM IST | Last Updated Sep 17, 2023, 6:40 PM IST

చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ గగ్గోలు పెడుతోందన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబం కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ బాధపడుతున్నారని చురకలంటించారు. పవన్‌ను నమ్ముకున్న వాళ్లు ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. పరామర్శకు వెళ్లి పవన్ పొత్తు కుదుర్చుకున్నారని అంబటి ఎద్దేవా చేశారు. పొత్తు నిర్ణయం పవన్ ఎప్పుడో తీసుకున్నారని.. బాబు, పవన్ కలిసి వస్తారని తాము ఎప్పుడో చెప్పామని రాంబాబు పేర్కొన్నారు. 

కక్ష సాధింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్త సంబంధం లేని వ్యక్తులు ఇంకా హడావుడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీతో పొత్తులో వుంటూ టీడీపీతో ఎలా కలుస్తావని అంబటి ప్రశ్నించారు. ఎన్డీయేలో లేని చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నావని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌కు నైతిక విలువలు లేవని .. పవన్‌కు రాజకీయంగా గానూ వ్యక్తిగతం గానూ నైతిక విలువలు లేవని అంబటి దుయ్యబట్టారు. 

ALso Read: బ్రహ్మాస్త్రం అనుకుని దించారు, దేవాన్ష్ కు చూపకండి : బ్రాహ్మణికి రోజా కౌంటర్

చంద్రబాబును సీఎంను చేయడమే పవన్ లక్ష్యమన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసుల సూచనలు ఎవరైనా పాటించాల్సిందేనని రాంబాబు సూచించారు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ కూడా రూల్స్ పాటించారని మంత్రి గుర్తుచేశారు. విపత్కర పరిస్ధితుల్లో అలజడి సృష్టించేందుకు పవన్ ప్రయత్నించారని అంబాబు దుయ్యబట్టారు. అందుకే పోలీసులు పవన్‌ను పోలీసులు వెనక్కి పంపించారని మంత్రి తెలిపారు.  

కొన్ని సందర్భాల్లో పోలీసుల సూచనలు ఎవరైనా పాటించాల్సిందేనని అంబటి పేర్కొన్నారు. చంద్రబాబు అన్యాయాలు చేసినప్పుడు పవన్ ఖండించలేదన్నారు. సీఎంపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని.. రెండు చోట్లా ఓడిన నువ్వా జగన్‌పై మాట్లాడేది అంటూ అంబటి ఫైర్ అయ్యారు. పవన్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని .. ఆయన మానసిక పరిస్ధితి ఏటి అని రాంబాబు ప్రశ్నించారు. 

పవన్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ వుందన్నారు. సత్తా లేనప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడతారని.. పవన్ రాజకీయాలకు పనికిరాని వ్యక్తని రాంబాబు దుయ్యబట్టారు. టీడీపీ సానుభూతి రాజకీయాలు ప్రజలు నమ్మరని.. చంద్రబాబు సాక్షాధారాలతో దొరికారని రాంబాబు పేర్కొన్నారు. టీడీపీ, జనసేన పొత్తును ఆ పార్టీ శ్రేణులే ఆహ్వానించలేదని.. పవన్ ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పగలరా అని సవాల్ విసిరారు. జనసైనికులను పవన్ మళ్లీ మోసం చేస్తున్నారని.. మీ పొత్తు అట్టర్ ఫ్లాపేనంటూ మంత్రి జోస్యం చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios