టీడీపీ జనసేన పార్టీలు సంయుక్తంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన సభపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ నాలుగో పెళ్లాం మనోహరేనని.. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు మొగుడు జగన్మోహన్ రెడ్డి అని అంబటి వ్యాఖ్యానించారు. 

టీడీపీ జనసేన పార్టీలు సంయుక్తంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన సభపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జెండా సభకు జనాలు రాకపోవడంతో ఆలస్యంగా మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. పొత్తు నా కోసం కాదు.. ప్రజల కోసం అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారని దుయ్యబట్టారు. అగ్నికి వాయువు తోడైందని చంద్రబాబు చెప్పారంటే.. రాష్ట్రం నాశనమైనట్లేనని , అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి వస్తాడా అంటూ ఎద్దేవా చేశారు.

పవన్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని.. ఆయనను నమ్ముకున్న అమాయకుల పరిస్ధితి ఏంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పవన్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరిని ఈదినట్లేనని.. ఎవరో రాసిన డైలాగులను ఆయన మాట్లాడారని దుయ్యబట్టారు. తన పార్టీకి 24 సీట్లు ఇవ్వడమే గొప్ప అన్నట్లుగా పవన్ మాట్లాడారని అంబటి ఎద్దేవా చేశారు. 

జగన్‌ను తొక్కేస్తానంటూ పిచ్చి మాటలు మాట్లాడారని.. లేకుంటే తన పేరు పవన్ కళ్యాణే కాదని అంటున్నాడని, అసలు ఆయన పేరు పవన్ కళ్యాణే కాదన్నారు. జగన్‌‌ను తొక్కాలంటే పవన్‌ను పుట్టించిన వాళ్లు రావాలని .. ఏది అనుకున్నాడో దాని గురించి నిలబడే నాయకుడు జగన్ అన్నారు. జనసైనికులనే అడిగితే పవన్ గొప్పో.. జగన్ గొప్పో చెబుతారని దుయ్యబట్టారు. పవన్ నాలుగో పెళ్లాం మనోహరేనని.. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు మొగుడు జగన్మోహన్ రెడ్డి అని అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పిల్లిని సంకన పెట్టుకుని వెళ్లకూడదనే లోకేష్‌ను సభకు రానివ్వలేదని.. లోకేష్ వచ్చాకే టీడీపీ ఫ్లాప్ అయ్యిందని మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.