కిరణ్ కుమార్ రెడ్డి..తన భవిష్యత్ కోసమే అలా చేశాడేమో.. అమరనాథ రెడ్డి

First Published 14, Jul 2018, 4:25 PM IST
minister amarnath reddy about nallri brothers
Highlights

.నమ్మించి మోసం చేసిన భారతీయ జనతా పార్టీ కన్నా.. ముందే చెప్పి మోసం చేసిన కాంగ్రెస్‌ను నమ్మొచ్చన్నారు.
 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసమే ఆ పార్టీలో చేరారని మంత్రి అమర్నాథరెడ్డి  అన్నారు. 

ఈ రోజు మీడియా సమావేశంలో మంత్రి అమరనాథ రెడ్డి మాట్లాడుతూ..నమ్మించి మోసం చేసిన భారతీయ జనతా పార్టీ కన్నా.. ముందే చెప్పి మోసం చేసిన కాంగ్రెస్‌ను నమ్మొచ్చన్నారు.

టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మి కిషోర్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్‌ కోసం కాంగ్రెస్‌లో చేరి ఉండవచ్చునని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కిరణ్ చేరికతో టీడీపీ, కాంగ్రెస్ జతకడతాయనడం సరికాదన్నారు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి అమర్నాథ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

loader