తనను వైసీపీలో చేర్చుకున్న కారణంగానే తాను శీలం పోగొట్టుకున్నారట. తాను టిడిపి ఎంఎల్ఏగా ఉన్నపుడు వైసీపీలోకి తీసుకుని తనను నాశనం చేసిందే వైసీపీ అట. టిడిపి ఎంఎల్ఏగా ఉన్న తనను తీసుకుని వెళ్ళి సమాధానం చెప్పుకునే పరిస్ధితి లేకుండా చేసిందే వైసీపీ అంటూ మండిపడ్డారు. తనలాంటి వాళ్ళని ముట్టుకున్న తర్వాత జగన్ కు అసలు క్యారెక్టరే లేదన్నారు.a
ఫిరాయింపు మంత్రులకు తాము ఏం మాట్లాడుతున్నామో కూడా అర్ధం కావటంలేదు. ఫిరాయింపులంటూ తమను జనాలు నిలదదీస్తుండటాన్ని జీర్ణించుకోలేకున్నారు. దాంతో తమను తాము సమర్ధించుకునేందుకు నానా అవస్తలు పడుతున్నారు. శనివారం నంద్యాలలో పర్యటించిన అమరనాధరెడ్డి మాటలు చూస్తే ఫిరాయింపులను సమర్ధించుకునేందుకు ఎంతగా అవస్తలు పడుతున్నారో అర్ధమైపోతుంది.
మీడియాతో మంత్రి మాట్లాడుతూ, వైసీపీ వల్లే తన శీలం పోగొట్టుకున్నారట. తన తండ్రితో పాటు మొదటినుండి తాను టిడిపిలో ఉన్నట్లు చెప్పారు. అంత వరకూ కరెక్టే. అయితే, 2014కు ముందు అమరనాధ్ టిడిపి ఎంఎల్ఏ హోదాలోనే వైసీపీలో చేరి తరువాత వైసీపీ తరపునే గెలిచారు. సరే, మళ్ళీ వైసీపీ నుండి తిరిగి టిడిపిలోకి ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని మంత్రి మాట్లాడుతూ, అప్పట్లో తనను వైసీపీలో చేర్చుకున్న కారణంగానే తాను శీలం పోగొట్టుకున్నారట. తాను టిడిపి ఎంఎల్ఏగా ఉన్నపుడు వైసీపీలోకి తీసుకుని తనను నాశనం చేసిందే వైసీపీ అట.
టిడిపి ఎంఎల్ఏగా ఉన్న తనను తీసుకుని వెళ్ళి సమాధానం చెప్పుకునే పరిస్ధితి లేకుండా చేసిందే వైసీపీ అంటూ మండిపడ్డారు. ‘తనను పూర్తిగా నాశనం చేసేసిన తర్వాత మళ్ళీ ఏ మొహం పెట్టుకుని తనను పిరాయింపుదారుడంటున్నారం’టూ మండిపడ్డారు. వైసీపీ నుండి వెళ్ళేటప్పుడు కూడా చెప్పారట
తన బ్లడ్ ఎల్లోగా ఉంటుందని. తాను టిడిపిని వదిలేసి వైసీపీలోకి ఎందుకు వెళ్ళాను అన్న విషయం జగన్ తో పాటు చంద్రబాబుకు కూడా తెలుసన్నారు. ‘తనలాంటి క్యారెక్టర్ ఉన్న వాడినే ఫిరాయింపుదారుడంటే, తనను నాశనం చేసిన నువ్వెవరు’? అంటూ జగన్ పై మండపడ్డారు. తనలాంటి వాళ్ళని ముట్టుకున్న తర్వాత జగన్ కు అసలు క్యారెక్టరే లేదన్నారు.
నిజానికి అమరనాధ్ వైసీపీలోకి వెళ్లింది టిడిపికి భవిష్యత్ లేదనే. రాష్ట్ర విభజనకు ముందు సీమాంధ్ర ప్రాంతంలో జరిగిన ప్రతీ ఎన్నికలోనూ టిడిపి ఓడిపోయింది. దాంతో టిడిపికి ఇక భవిష్యత్ లేదన్న ఉద్దేశ్యంతోనే చాలామంది టిడిపిని వదిలేసి వైసీపీలో చేరారు. అటువంటి వాళ్లల్లో అమరనాధరెడ్డి కూడా ఒకరు.
అయితే, తర్వాత రాష్ట్ర విభజన జరగటం, అదృష్టం కొద్దీ టిడిపి అధికారంలోకి వచ్చింది. దాంతో అమర్ వైసీపీలో ఉండలేకపోయారన్నది వాస్తవం. అవకాశం చూసుకుని టిడిపిలోకి దూకేసి మంత్రి అయ్యారు. ఆ విషయాన్ని అంగీకరించలేక టిడిపిలో ఉన్నపుడు జగనేదో తనను బలవంతంగా లాక్కుపోయినట్లు బిల్డప్ ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది. తన భవిష్యత్ కోసమే రెండుసార్లూ అమరనాధ్ పార్టీ మారింది వాస్తవం. ఆ విషయాన్ని అంగీకరించలేక ఇపుడు అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్ పై మండిపడుతున్నారంతే.
