విశాఖలో స్మశాన వాటికలను 1-10వరకు పెంచేలా చర్యలు... ఆళ్లనాని
సీఎం ఆదేశాల మేరకు vims ను సందర్శించామని, Vims ఏర్పాటు ప్రాధాన్యత రీత్యా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్లనాని తెలిపారు.
సీఎం ఆదేశాల మేరకు vims ను సందర్శించామని, Vims ఏర్పాటు ప్రాధాన్యత రీత్యా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్లనాని తెలిపారు.
విమ్స్ లో 400 ఆక్సిజన్ బెడ్స్ వున్నాయి. వీటిని ఆరు వందల బెడ్ లకు పెంచే ప్రతిపాదనలు చేశారు. ఆక్సిజన్ అందుబాటు బట్టి బెడ్ ల సంఖ్య పెంచే ఆలోచన వుంది.
ఇప్పుడు vims లో 10 టన్నుల ఆక్సిజన్ అందుబాటులో వుంది. ఈ ఆక్సిజన్ కోటా శాతం పెంచే ఆలోచనల్లో ఉన్నాం. Vims లో 20 టన్నుల ఆక్సిజన్ స్టోరేజ్ సామర్ధ్యం పెంచుతామని, అన్ని బెడ్ లకు సమానంగా ఆక్సిజన్ అందే చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
అంతేకాదు Vims లో కోవిడ్ రోగులతో టెలిఫోన్ కాన్ఫరెన్స్ లో మంత్రి ఆళ్ల నాని మాట్లాడారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వృధా కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించామని తెలిపారు.
విశాఖలో స్మశాన వాటికలను ఒకటి నుంచి పదివరకు పెంచనున్నామని తెలిపారు. రెమిడీ సివర్ ఇంజెక్షన్ అక్రమాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రస్తుత మున్న పరిస్థితుల దృష్ల్యా విశాఖ కు రోజుకు 80 టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా 100 టన్నుల ఆక్సిజన్ సేకరించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.
ఏపీ కి 910 టన్నుల ఆక్సిజన్ అవసరం పై సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారన్నారు. విశాఖ జిల్లా పై ప్రత్యేక దృష్టి పెట్టండ ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు.