టిడిపి మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఏకంగా కేంద్రప్రభుత్వానికికే డెడ్ లైన్ పెట్టారు. టిడిపి పెట్టిన డిమాండ్లు అంగీకరించే విషయంలొ బిజెపినే హచ్చరించారు. ఇంతకీ మంత్రి ఏమన్నారంటే, 19 అంశాలు కేంద్రం ముందుంచామని వాటిల్లో ఏ ఒక్కటి చేయకపోయినా అదే పొత్తుకు చివరి రోజని హెచ్చరించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన ప్రకటన సంచలనంగా మారింది.  జగన్ తన ఎంపీల రాజీనామాలు చేయించే కంటే మేమే ముందు రాజీనామాలు చేయిస్తామని సవాలు విసిరారు. జగన్ కంటే రాజీనామాల్లో టీడీపీదే ప్రీ షెడ్యూలంటూ గట్టిగా చెప్పారు. ఆయనది ఏప్రిల్ 6వ తేదీ డెడ్ లైన్ అయితే తమది మార్చ్ 5వ తేదీ డెడ్ లైన్ గా తెలిపారు. మార్చి 5న పార్లమెంట్ లో కేంద్రం ఏపీకి అనుకూలమైన ప్రకటన చేయకపోతే ఆరోజే తమ కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారంటూ ప్రకటించారు. అదే రోజు తాము బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకుంటామని కూడా హెచ్చరించారు.