Asianet News TeluguAsianet News Telugu

చెప్పినదానికంటే ఎక్కువే చేశాం తప్ప.. తక్కువ చేయలేదు: జగన్‌పై మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రశంసలు

రెండున్నరేళ్ల పాలనలో సీఎం జగన్ ఎన్నో మంచి సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు మంత్రి ఆదిమూలపు సురేశ్ . పరిపాలన, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు. ప్రజలకు చెప్పినదానికంటే ఎక్కువే చేశారు తప్ప తక్కువ చేయలేదని అన్నారు. 

minister adimulapu suresh praises ap cm ys jagan
Author
Amaravati, First Published Nov 30, 2021, 2:45 PM IST

రెండున్నరేళ్ల పాలనలో సీఎం జగన్ ఎన్నో మంచి సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు మంత్రి ఆదిమూలపు సురేశ్ (adimulapu suresh ) . మంగళవారం మీడియతో మాట్లాడిన ఆయన పరిపాలన, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు. ప్రజలకు చెప్పినదానికంటే ఎక్కువే చేశారు తప్ప తక్కువ చేయలేదని అన్నారు. వరుసగా మూడవ త్రైమాసకానికి ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు చేశారని సురేశ్ చెప్పారు. కరోనా వంటి విపత్తులు వచ్చినా సంక్షేమ అభివృద్ధి ఎక్కడా ఆగలేదని.. విద్యా వ్యవస్థ‌ను పూర్తిగా ప్రక్షాళన చేశామని ఆదిమూలపు వెల్లడించారు. 

రెండున్నరేళ్లుగా కోటికి పైగా విద్యార్థులకు దాదాపు 35 వేల కోట్లు ఖర్చు చేశామని... ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నాయని మంత్రి మండిపడ్డారు. రెండున్నరేళ్లుగా ఒక్క అవినీతి మరక లేకుండా మా ప్రభుత్వం పాలన సాగిందని ఆయన తెలిపారు. రాజకీయాల్లో దౌర్జన్యాలు, అరాచకాలు చేయడం టీడీపీ సంస్కృతి అని .. సీఎం గాల్లో కలిసిపోతారనే దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు. మూడు పార్టీలు కుమ్మక్కు అయ్యి ముప్పేట దాడి చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాయని.. ప్రకృతి విపత్తు వస్తే ప్రభుత్వ తప్పిదం అంటున్నారని సరరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ALso Read:జగనన్న విద్యా దీవెన : నేడే మూడో విడత నిధుల పంపిణీ..

Jagananna Vidya Deevenaలో భాగంగా పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ లో భాగంగా మూడో విడత డబ్బులు ఇవాళ సీఎం జగన్ విడుదల చేశారు. ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ, ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను మంగళవారం నాడు.. సీఎం YS Jagan క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన Poor students అందరికీ పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌. ఐటీఐ, పాలిటెక్నిక్,డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు చదివే పేద విద్యార్దులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే (మూడు నెలలు) విద్యార్ధుల Mothers ఖాతాల్లో నేరుగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జమచేస్తోంది. తల్లులు ప్రతీ మూడు నెలలకోసారి కాలేజీలకు నేరుగా వెళ్ళి ఫీజులు చెల్లించడం ద్వారా వారి పిల్లల చదువులు, కాలేజీలలో వసతులు పరిశీలించి లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారు. కాలేజీలలో జవాబుదారీతనం, కాలేజీల స్ధితిగతులు, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ రెండూ జరుగుతాయి. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఉన్నత విద్య చదివే అవకాశం, అందరికీ వర్తింపు, తద్వారా అన్ని విధాల కుటుంబాలు స్ధిరపడనున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios