Asianet News TeluguAsianet News Telugu

జగనన్న విద్యా దీవెన : నేడే మూడో విడత నిధుల పంపిణీ..

దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన Poor students అందరికీ పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌. ఐటీఐ, పాలిటెక్నిక్,డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు చదివే పేద విద్యార్దులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే (మూడు నెలలు) విద్యార్ధుల Mothers ఖాతాల్లో నేరుగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జమచేస్తోంది.

Distribution of funds for the third installment of Jagananna Vidya Deevena
Author
Hyderabad, First Published Nov 30, 2021, 12:18 PM IST

అమరావతి : Jagananna Vidya Deevenaలో భాగంగా పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ లో భాగంగా మూడో విడత డబ్బులు ఇవ్వాళ చెల్లించనున్నారు. ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ, ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను మంగళవారం నాడు.. సీఎం  YS Jagan క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

జగనన్న విద్యా దీవెన
దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన Poor students అందరికీ పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌. ఐటీఐ, పాలిటెక్నిక్,డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు చదివే పేద విద్యార్దులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే (మూడు నెలలు) విద్యార్ధుల Mothers ఖాతాల్లో నేరుగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జమచేస్తోంది.

తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా...
తల్లులు ప్రతీ మూడు నెలలకోసారి కాలేజీలకు నేరుగా వెళ్ళి ఫీజులు చెల్లించడం ద్వారా వారి పిల్లల చదువులు, కాలేజీలలో వసతులు పరిశీలించి లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారు.

కాలేజీలలో జవాబుదారీతనం, కాలేజీల స్ధితిగతులు, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ రెండూ జరుగుతాయి.

కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఉన్నత విద్య చదివే అవకాశం, అందరికీ వర్తింపు, తద్వారా అన్ని విధాల కుటుంబాలు స్ధిరపడనున్నాయి.

జగనన్న విద్యా దీవెన 
మొదటి విడత – 19 ఏప్రిల్‌ 2021
రెండో విడత – 29 జులై 2021 
మూడవ విడత – 30 నవంబర్‌ 2021 
నాలుగవ విడత – ఫిబ్రవరి 2022

‘‘ మీరే సీఎంగా ఉండాలి.. థాంక్యూ సోమచ్‌ జగన్‌ మావయ్య’’: విద్యా దీవెన అందుకున్న వేళ విద్యార్ధిని వ్యాఖ్యలు

గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ఫీజులకు అరకొర మొత్తాలు విదిలించి చేతులు దులుపుకోవడం, అదీ సరైన సమయంలో ఇవ్వకపోవడం వంటి చర్యలకు స్వస్తి పలుకుతూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,778 కోట్లు బకాయిలతో కలిపి ఇప్పటివరకు చెల్లించిన మొత్తం రూ.6,259 కోట్లు. కరోనా సమయంలో కూడా అంతరాయం లేకుండా ఫీజుల చెల్లింపులు చేసింది.

విద్యారంగంలో ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన వ్యయం – మొత్తం లబ్దిదారులు – 1,99,38,694, లబ్ది రూ.కోట్లలో 34,622.17

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ లో జగనన్న విద్యాదీవెన, ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లపై అప్పీల్‌కు వెళ్తామని  ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. సెప్టెంబర్ 7, మంగళవారం  నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తే జవాబుదారీతనం ఉంటుందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.

జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యాసంస్థల యాజమాన్యానికి  డబ్బులిస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారని మంత్రి  సురేష్ ప్రశ్నించారు. కొన్ని కళాశాలల్లో పీఆర్వో వ్యవస్థ విద్యాదీవెన కోసమే అడ్మిషన్లు చేస్తున్నాయని మంత్రి తెలిపారు. విద్యార్థులకు  75 శాతం అటెండెన్స్‌ లేకపోతే రెండో విడత ఈ పథకం కింద నిధులు జమ కావన్నారు.  గతంలో ఇంటర్‌ అడ్మిషన్లలో రిజర్వేషన్లు పాటించలేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  పూర్తి పారదర్శకత కోసమే ఆన్‌లైన్‌ విధానం. డిగ్రీ అడ్మిషన్లలో ఆన్‌లైన్‌ విధానం విజయవంతమైందని  మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios