ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివఅద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ప్రమాదం తప్పింది.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివఅద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్ వెళ్లేందుకు మంత్రి సురేష్ యత్నించారు. అయితే విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో స్టార్టింగ్‌లోనే కుదుపులు చోటుచేసుకున్నాయి. దీంతో మంత్రి ఆదిమూలుపు సురేష్ వ్యక్తిగత సిబ్బంది అలర్ట్‌ కావడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి నిర్వాహకులపై కలెక్టర్ మల్లికార్జున అసహనం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే.. విశాఖ ఆర్‌కే బీచ్‌లో జీ 20 సదస్సు సన్నాహక మారథాన్‌ను ఈరోజు ఉదయం మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్, విడదల రజని ప్రారంభించారు. 5కే, 10కే మారథన్‌లను వారు ప్రారంభించారు. అయితే మారథాన్‌ను ప్రారంభించిన అనంతరం.. నిర్వాహకుల ఆహ్వానం మేరకు మంత్రి ఆదిమూలపు సురేష్ పారా గ్లైడింగ్‌కు వెళ్లారు.

 ఇక, ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నం వేదికగా జీ-20 సన్నాహక సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు విడదల రజని ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్‌లు శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.