Asianet News TeluguAsianet News Telugu

టైం టేబుల్ తో సిద్దంగా వుండండి...: పది, ఇంటర్ పరీక్షలపై అధికారులకు మంత్రి సురేష్ ఆదేశాలు

పరీక్షలు నిర్వహణ, నాడు నేడు కార్యక్రమాల గురించి చర్చించేందుకు మంత్రి సురేష్ విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.

minister aadimulapu suresh review meeting with educational department officers akp
Author
Amaravati, First Published Jun 10, 2021, 8:13 PM IST

అమరావతి: పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు జూలై నెలలో పరిస్థితులు అనుకూలిస్తే టైం టేబుల్ తయారు చేసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమీక్షకోసం సిద్ధం కావాలంటూ మంత్రి అధికారులకు సూచించారు. 

పరీక్షలు నిర్వహణ, నాడు నేడు కార్యక్రమాల గురించి చర్చించేందుకు మంత్రి సురేష్ విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి, నాడు నేడు కార్యక్రమం మొదటి విడత పనులపై విద్యాశాఖ మంత్రి మరోమారు సమీక్షించారు. మొదటి విడత పనులు ముగించి త్వరలో రెండో విడత పనులు ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో ప్రతి వారం మంత్రి అధికారులతో సమీక్షిస్తున్నారు.   

ఈ సందర్బంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ... ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేశామన్నారు. గడువులోగా మొదటి విడత పనులు పూర్తి చేసి రెండోవిడత పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. 

read more  హైదరాబాద్ వల్ల చాలా ఇబ్బంది... రాజమండ్రి బెటర్: కేంద్ర మంత్రితో సీఎం జగన్

''నాడు నేడు పనుల్లో ముఖ్యంగా ప్రహరీల నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలి. ఇప్పటికి ఇంకా ప్రారంభించనివి కాకుండా వివిధ దశల్లో (బేస్మెంట్, వాల్ కంప్లీట్, గేట్స్, పెయింటింగ్ పెండింగ్) ఉన్నవాటిని ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేయాలి. 14,971 పాఠశాలల్లో పెయింటింగ్ పనులకు గాను 82 శాతం పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలినవి కూడా పూర్తి చేయాలి'' అని ఆదేశించారు. 

 జాతీయ నూతన విద్యావిధానంపై ఉపాధ్యాయ సంఘాలనుంచి వినిపిస్తున్న సందేహాలపై అధికారులతో మంత్రి చర్చించారు. ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయుల నుంచి సూచనలు తీసుకుని పరిశీలించాలి మంత్రి తెలిపారు. 

2021-22 విద్యాసంవత్సరం కాలెండర్ ను తయారు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. జగనన్న విద్యాకానుక సరఫరా తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రితో జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, డైరెక్టర్ పాఠశాల విద్య చినవీరభద్రుడు, సమగ్రశిక్ష ఎస్పీడి వెట్రిసెల్వి, ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios