Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఆ స్ట్రాటజీ వాడితే...బాబుకు కష్టమే: అసదుద్దీన్ ఒవైసీ

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ సొంతంగా 280 స్థానాలు గెలుచుకుంటాయన్న నమ్మకం తనకు లేదని ఆయన తేల్చి చెప్పారు. 

mim president asaduddin owaisi comments on AP Elections
Author
Hyderabad, First Published Dec 2, 2018, 9:39 AM IST

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ సొంతంగా 280 స్థానాలు గెలుచుకుంటాయన్న నమ్మకం తనకు లేదని ఆయన తేల్చి చెప్పారు.

దేశాన్ని నడిపించే సత్తా, సామర్ధ్యం కేవలం రాహుల్, మోడీలకు మాత్రమే లేదని చాలామంది ఉన్నారని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సొంతంగా 120 స్థానాలు సాధిస్తే కేసీఆర్, అసదుద్దీన్‌ల అవసరమే లేదని, ఏపీలో కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క లోక్‌సభ స్ధానం కూడా రాదని జోస్యం చెప్పారు.

అక్కడ పోటీ అంతా టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుందని సరైన వ్యూహాంతో వైసీపీ అధినేత జగన్ ముందుకు వెళితే ఆయనను ఎదుర్కోవడం కష్టమని ఒవైసీ సూచించారు. మరోవైపు ఎంఐఎంకు టీఆర్ఎస్ బీఫ్ బిర్యానీ వడ్డిస్తుందడన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలపై అసదుద్దీన్ మండిపడ్డారు.

మీ సిద్ధాంతాల ప్రకారం మీకు బిర్యానీ అంటే ఇష్టం ఉండకపోవచ్చు.. కానీ తన వ్యక్తిగత ఆహార అలవాట్లను ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదన్నారు. బీజేపీకి ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపైనా ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో తాము కాంగ్రెస్ ‘‘ఎఫ్’’ టీమ్‌లో ఉన్నామని... భవిష్యత్తులో తాము ‘‘ఏ’’ టీమ్‌‌కు వెళతామని అన్నారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని కేసీఆర్, కేటీఆర్ స్పష్టం చేశారని.. గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గులామ్ అని వ్యాఖ్యానించారు.  ఎన్నికల ప్రచారంలో ఆయన తన అహంకార పూరిత ధోరణితో హైదరాబాదీలను ఆజాద్ కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios