వలస కూలీల బస్సుకు రోడ్డు ప్రమాదం... క్షతగాత్రులకు రోడ్డుపైనే ప్రథమచికిత్స అందించిన మంత్రి

లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలసకూలీలను తరలించేందుకు ఏర్పాటుచేసిన బస్సు  రోడ్డు ప్రమాదానికి గురయిన విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

Migrant Workers Bus Accident At guntur

గుంటూరు: లాక్ డౌన్ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో చిక్కుకున్న ఇతరరాష్ట్రాల వలసకూలీలను తరలించేందుకు ఏర్పాటుచేసిన బస్సు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. తమిళనాడు నుండి వచ్చిన బస్సు గుంటూరు జిల్లాలో రోడ్డుప్రమాదానికి గురవగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను కాపాడి ఆస్పత్రికి తరలించడమే కాదు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఇలా ప్రమాద బాధితులను కాపాడి గొప్పమనసును చాటుకున్నారు మంత్రి అనిల్. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు కు చెందిన వలసకూలీలను స్వరాష్ట్రానికి తరలించేందుకు ఆ రాష్ట్రం నుండి ఓ బస్సు ఏపికి వచ్చింది. అయితే గుంటూరు జిల్లా ఓబులనాయుడు పాలెం వద్ద జాతీయరహదారిపై ప్రయాణిస్తుండగా బస్సు ఓ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ క్యాబిన్ లోనే చిక్కుకుపోయాడు. 

read more సంక్షేమం, అభివృద్ధి బాటలో మరో ముందడుగు... నేడే రూ.450 కోట్లు విడుదల

అదే సమయంలో నెల్లూరు వైపు వెళుతున్న మంత్రి అనిల్ కుమార్ ఈ ప్రమాదాన్న గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ని ఆపి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అతికష్టం మీద డ్రైవర్ ను బయటకు తీయించారు. అనంతరం డ్రైవర్, క్లీనర్ కి స్వయంగా ప్రథమచికిత్స చేసిన మంత్రి  అనంతరం ఇద్దరినీ హాస్పిటల్ కు తరలించారు.  

అయితే తీవ్రగా గాయపడిన బస్సు డ్రైవర్ రాజా(48)చికిత్స పొందుతూ మృతిచెందాడు. క్లీనర్ బాబు పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం. 

 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios