తిరుపతి శ్రీనివాస సేతు నిర్మాణ పనుల్లో అర్ధరాత్రి ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి.. ఏం జరిగిందంటే ?
తిరుపతిలో చేపడుతున్న శ్రీనివాస సేతు నిర్మాణంలో బుధవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలోని తిరుపతిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీనివాస సేతు నిర్మాణ పనుల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించారు. ఇందులో ఒకరు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు కాగా.. మరొకరు బీహార్ కు చెందిన వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Swiggy Instamart: వింత రిజిగ్నేషన్ లెటర్.. చూస్తే నవ్వాపుకోవడం కష్టమే.. !
శ్రీనివాస సేతు నిర్మాణ పనుల్లో భాగంగా సమీపంలో ఉన్న రిలయన్స్ మార్టు దగ్గరలో బుధవారం అర్ధరాత్రి సమయంలో రైల్వే బ్రిడ్జి వద్ద క్రేన్ తో ఓ గడ్డర్ సెగ్మెంట్ ను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఆ సెగ్మెంట్ కింద కార్మికులు బోల్టులు బిగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో అది ఒక్క సారిగా జారి కింద పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది.
Viral Video: బైక్‌పై 'త్రీ ఇడియట్స్' సీన్‌ను రీక్రియేట్.. అదిరిపోయేలా పోలీసులు రియాక్ట్..
ఈ ఘటనలో ఆప్కాన్స్ సంస్థలో పని చేసే, పశ్చిమ బెంగాల్ వాసి అయిన 20 ఏళ్ల అభిజిత్‌ఘోష్, అదే సంస్థలో పని చేసే బీహార్ వాసి అయిన 44 ఏళ్ల బుద్ధా మందల్ చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డెడ్ బాడీలను ఎస్వీ మెడికల్ కాలేజీలకు తీసుకెళ్లారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.