పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని అన్నారు. అలా చేస్తే ఈ నెల 30వ తేదీలోపు పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తానని వివరించారు. 

అమరావతి: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. అలా చేస్తే పవన్ కళ్యాణే తమ సీఎం క్యాండిడేట్ అని ఆగస్టు నెలాఖరు కల్లా ప్రకటించేస్తానని వివరించారు. వచ్చేయ్ పార్టీని విలీనం చేసేయ్.. లక్షల కోట్లు తెస్తా అని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌కు కాపుల మద్దతు లేదని కేఏ పాల్ అన్నారు. కాపులు ఓటేస్తే గెలిచిన చిరంజీవి.. మంత్రి పదవి కోసం కాంగ్రెస్‌కు అమ్మేశాడని విమర్శించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా పవన్ కళ్యాణ్ వెంట లేరని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌కు కోటి మంది ఫ్యాన్స్ ఉన్నారని, కానీ, లక్ష మంది కూడా ఓటేయరని అన్నారు. గాజువాక, భీమవరంలో గెలిపించలేదని తెలిపారు. 

Also Read: కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ! నేనే ఆహ్వానించా: ఎమ్మెల్యే గంప గోవర్ధన్

పవన్ కళ్యాణ్ పదిహేను సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చారని, కానీ, తాను ఇటీవలే వచ్చానని కేఏ పాల్ అన్నారు. అయినా.. తనను ప్రజలు గెలిపిస్తారని, ఎందుకంటే తాను పునాదులు వేసుకుంటూ వస్తున్నానని వివరించారు. ఇంకా ఎవరైనా పార్టీలో చేరేవారుంటే చేరాలని సూచించారు.