చిత్తూరు జిల్లా పుంగనూరులో విషాదం చోటు చేసుకుంది. మెర్సీకిల్లింగ్ కు అనుమతి ఇవ్వాలంటూ కోర్టుకు వచ్చిన బాలుడు అక్కడే మృతి చెందాడు. 

చౌడేపల్లి మండలం విజయపల్లికి చెందిన అరుణ తన కొడుకును మెర్సీ కిల్లింగ్ కు అనుమతించాలని పుంగనూరు కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు విచారించే లోపే హర్షవర్ధన్ మృతి చెందాడు.

పదేళ్ల హర్షవర్థన్ నాలుగేళ్ల క్రితం స్కూలు బిల్డింగ్ మీదినుంచి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా బాగవ్వలేదు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టారు. ఇక తమ దగ్గర అంత ఆర్థిక స్థోమత లేదని.. మెర్సీ కిల్లింగ్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. 

ఎన్ని చికిత్సలు చేయించినా అతను చికిత్సకు స్పందించలేకపోవడం.. డాక్టర్లు ఒక సంవత్సరం వరకే అతను బతికే ఛాన్స్ ఉన్నాయని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఏమీ చేయలేక మెర్సీ కిల్లింగ్ కు పిటిషన్ పెట్టుకున్నారు.