Asianet News TeluguAsianet News Telugu

మానసిక వికలాంగురాలిపై కామాంధుడి అత్యాచారం.. సహకరించిన భార్య..

చిట్టి బాబు కన్ను ఆ బాలిక మీద పడింది.  ఆమెనెలాగైనా అనుభవించాలనుకున్నాడు. దీనికోసం భార్య సాయం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి కుటుంబాన్ని బాగా నమ్మించారు.

mentally handicapped girl raped by a man in guntur
Author
Hyderabad, First Published Oct 25, 2021, 9:35 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు : ఓ మానసిక వికలాంగురాలిపై ఓ కామోన్మాది అత్యాచారానికి పాల్పడ్డాడు. తన భార్య సహకారంతోనే ఈ వ్యవహారం సాగడం గమనార్హం. బాధితురాలు గర్భం దాల్చడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.  

గుంటూరు రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక Mentally handicapped. సదరు బాలిక తాతకు స్నేహితుడైన చిట్టిబాబు బాలిక ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. బాలిక పరిస్థితిని గమనించాడు. 

ఈ క్రమంలో చిట్టి బాబు కన్ను ఆ బాలిక మీద పడింది. ఏం చేసినా ఆ బాలిక చెప్పుకోలేని స్థితిని ఆసరాగా తీసుకోవాలనుకున్నాడు.  ఆమెనెలాగైనా అనుభవించాలనుకున్నాడు. దీనికోసం భార్య సాయం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి తాము మంచివాళ్లలాగా కుటుంబాన్ని బాగా నమ్మించారు. బాలిక మీద ప్రేమ ఉన్నట్టు, కన్ సర్న ఉన్నట్టు నటించేవారు.

దీంతో కుటుంబసభ్యులు కూడా వీరిని అమాయకంగా నమ్మేశారు. అలా కొద్ది రోజులు గడిచాక...చిట్టిబాబు భార్య girl ఇంటికి వచ్చి బాలికకు  జడ వేస్తానని తీసుకువెళ్లేది. ఆ తరువాత  ఆమెను, తన భర్తను గదిలోకి పంపి బయట కాపలా ఉండేది. ఈ విధంగా చిట్టిబాబు అనేకసార్లు బాలికపై 
Rape చేశాడు. 

ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతూ ఉండేది. తనకు ఏం జరుగుతుందో తెలియని బాలిక ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేకపోవడంతో వారి ఆటలు చాలా కాలం సాగాయి. 

అయితే ఇటీవల బాలిక అస్వస్థతకు గురి కావడంతో .. ఆస్పత్రిలో చూపిస్తే.. ఆమె pregnant అన్న విషయం తెలిసింది. షాక్ అయిన family members  ఆరా తీయగా వెలుగులోకి వచ్చింది. దీంతో చిట్టిబాబు, అతని భార్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

భార్య కాపురానికి రాలేదని.. నమ్మించి గొంతు కోసి, పరారైన భర్త...

కోపంతో భార్య గొంతు కోసి.. 
ఇదిలా ఉంటే.. చిత్తూరులో మరో వ్యక్తి.. అకారణంగా భార్యమీద దారుణానికి ఒడిగట్టాడు.  పిలిచిన వెంటనే పుట్టింటి నుంచి కాపురానికి రాలేదని ఆగ్రహంతో భర్త కత్తితో భార్య గొంతు కోసి పరారయ్యాడు.  పోలీసులు స్థానికుల కథనం ప్రకారం చిత్తూరు జిల్లా సోమల మండలం 81   ఉప్పరపల్లె పంచాయితీ  మల్లోలపల్లెకు చెందిన  భాగ్యశ్రీ మూడేళ్ల క్రితం పూతలపట్టు మండలం తుమ్మల పల్లికి చెందిన వేంకటాద్రి తో వివాహం అయ్యింది.

వీరికి తొమ్మిది నెలల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య family disputes  ఉన్నాయి. మూడు రోజుల కిందట ఆరోగ్యం సరిగా లేక భాగ్యశ్రీ పుట్టింటికి వచ్చింది. ఆదివారం అక్కడికి వచ్చిన వెంకటాద్రి తనతోపాటు రావాల్సిందిగా  కోరగా..  కొద్దిరోజుల తర్వాత వస్తానని భార్య చెప్పింది.

 ఈ విషయమే ఆగ్రహంతో ఉన్న భర్త ఆసుపత్రిలో చూపించుకోని వస్తానని టూవీలర్ పై ఆమెను తీసుకుని సోమశిల కు బయలుదేరాడు. మార్గమధ్యంలో అడుసుమిల్లి పొలాల వద్ద  టూవీలర్ ఆపి భార్యను  knifeతో విచక్షణారహితంగా గాయపరచి slit throat చేశాడు. ఆమె కేకలు వేయడంతో సమీపంలోని రైతులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో పరారయ్యాడు.

తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు పీహెచ్సీకి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.  ఆమె మృత్యువుతో పోరాడుతోంది సంఘటనా స్థలాన్ని సిఐ మధుసూదన్ రెడ్డి, ఎస్సై లక్ష్మీకాంత్ పరిశీలించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios