భార్య కాపురానికి రాలేదని.. నమ్మించి గొంతు కోసి, పరారైన భర్త...
ఆగ్రహంతో ఉన్న భర్త ఆసుపత్రిలో చూపించుకోని వస్తానని టూవీలర్ పై ఆమెను తీసుకుని సోమశిల కు బయలుదేరాడు. మార్గమధ్యంలో అడుసుమిల్లి పొలాల వద్ద టూవీలర్ ఆపి భార్యను knifeతో విచక్షణారహితంగా గాయపరచి గొంతు కోశాడు.
సోమశిల : పిలిచిన వెంటనే పుట్టింటి నుంచి కాపురానికి రాలేదని ఆగ్రహంతో భర్త కత్తితో భార్య గొంతు కోసి పరారయ్యాడు. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం చిత్తూరు జిల్లా సోమల మండలం 81 ఉప్పరపల్లె పంచాయితీ మల్లోలపల్లెకు చెందిన భాగ్యశ్రీ మూడేళ్ల క్రితం పూతలపట్టు మండలం తుమ్మల పల్లికి చెందిన వేంకటాద్రి తో వివాహం అయ్యింది.
వీరికి తొమ్మిది నెలల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య family disputes ఉన్నాయి. మూడు రోజుల కిందట ఆరోగ్యం సరిగా లేక భాగ్యశ్రీ పుట్టింటికి వచ్చింది. ఆదివారం అక్కడికి వచ్చిన వెంకటాద్రి తనతోపాటు రావాల్సిందిగా కోరగా.. కొద్దిరోజుల తర్వాత వస్తానని భార్య చెప్పింది.
ఈ విషయమే ఆగ్రహంతో ఉన్న భర్త ఆసుపత్రిలో చూపించుకోని వస్తానని టూవీలర్ పై ఆమెను తీసుకుని సోమశిల కు బయలుదేరాడు. మార్గమధ్యంలో అడుసుమిల్లి పొలాల వద్ద టూవీలర్ ఆపి భార్యను knifeతో విచక్షణారహితంగా గాయపరచి slit throat చేశాడు. ఆమె కేకలు వేయడంతో సమీపంలోని రైతులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో పరారయ్యాడు.
తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు పీహెచ్సీకి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఆమె మృత్యువుతో పోరాడుతోంది సంఘటనా స్థలాన్ని సిఐ మధుసూదన్ రెడ్డి, ఎస్సై లక్ష్మీకాంత్ పరిశీలించారు.
ఇదిలా ఉండగా, మరో కేసులో కన్నతల్లినే కడతేర్చాడో కసాయి కొడుకు.. నవమాసాలు కనిపెంచిన తల్లిపైనే కత్తితో దాడిచేసి చంపేందుకు ప్రయత్నించాడో కసాయి కొడుకు. తన కడుపును పుట్టినవాడు అదే కడుపులో కత్తితో పొడవడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది ఆ తల్లి. ఈ దారుణం శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే..
వివరాల్లోకి వెళితే... srikakulam district పాలకొండ మండలం సింగన్నవలస గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో కలహాలు రేగాయి. అయితే ఈ కలహాలకు కన్నతల్లే కారణంగా భావించిన తనయుడు దారుణానికి ఒడిగట్టాడు. నవమాసాలు కడుపున మోసి కంటికిరెప్పలా కాపాడుతూ పెంచిన తల్లిపైనే కర్కశంగా హతమార్చడానికి ప్రయత్నించాడు. కన్నతల్లిపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కొడుకు దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ తల్లిని పాలకొండ ఏరియా ఆసుపత్రికు తరలించి చికిత్స అందిస్తున్నారు. కత్తితో దాడిచేయడంతో తీవ్ర రక్తస్రావం అయినట్లు... ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు.
తల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన కసాయి కొడుకు నేరుగా పాలకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన కొడుకుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.