పోలవరం: పోలవరం ప్రాజెక్టు పనులను దక్కించుకొన్న మేఘా (ఎంఈఐఎల్) సంస్థ గురువారం నాడు పనులను ప్రారంభించింది.  పోలవరం ప్రాజెక్టు పనుల్లో అంతర్భాగమైన కాంక్రీట్ పన్నులు ప్రారంభించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ప్రాజెక్టు పనులను మేఘా సంస్థ దక్కించుకొన్న విషయం తెలిసిందే.

Also Read:జగన్ శీతకన్ను: సీఎం బస్సులకే దిక్కు లేదు!

 పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే ప్రాంతంలో  కాంక్రీట్ పనులను ప్రారంభించింది. తొలి రోజు 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను చేశారు. ప్రతి రోజూ రెండు వేల క్యూబిక్ మిటీర్ల కాంక్రీట్ పనులను చేపట్టాలని ఎంఈఐఎల్ సంస్థ నిర్ణయం తీసుకొంది.

Also Read:కేంద్ర మంత్రితో సీఎం జగన్ భేటీ.... కడప స్టీల్ ప్లాంట్ పై కీలక నిర్ణయం

రాక్‌ఫిల్ డ్యామ్‌లో 1.50కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు చేయనున్నారు. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్, కాఫర్ డ్యామ్ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేయనుంది. 

2021 జూన్ నాటికి రాక్ ఫిల్ డ్యామ్ లో 1. 50 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులను  పూర్తి చేయాలని  మేఘా సంస్థ లక్ష్యంగా పెట్టుకొంది.   2020 జూన్ నాటికి  స్పిల్‌వే పనులను పూర్తి చేస్తామని మేఘా సంస్థ ప్రకటించింది.

పోలవరం  ప్రధాన డ్యామ్‌, జలవిద్యుత్ ప్రాజెక్టు పనులను మేఘా కంపెని దక్కించుకొన్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.3216 కోట్ల విలువైన జల విద్యుత్ ప్రాజెక్టు, హెడ్ వర్క్స్‌కు  సంబంధించి ఈ ఏడాది ఆగష్టు 17వ తేదీన ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది. గత ప్రభుత్వ హాయంలో పోలవరం హెడ్‌వర్క్, విద్యుత్ ప్రాజెక్టు కు సంబంధించి నవయుగ కంపెనీ కాంట్రాక్టును దక్కించుకొంది.

అయితే ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ వైఎస్ జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్‌కు ఆగష్టు  17వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్‌పై హైకోర్టును ఆశ్రయించింది నవయుగ కంపెనీ. 

పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, జల విద్యుత్ ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండర్లను ఆగష్టు17న ఆహ్వానిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రివర్స్ టెండర్లను పోలవరం ప్రాజెక్టు అథారిటీ వ్యతిరేకించింది. ఈ విషయమై పీపీఏ సీఈఓ ఆర్ కే జైన్ ఏపీ ప్రభుత్వానికి ఆగష్టు 16న లేఖ రాసిన విషయం తెలిసిందే.

జల విద్యుత్ ప్రాజెక్టు పనుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ టెండర్లను అప్ లోడ్ చేయలేదు. కానీ., ఈ టెండర్లను అప్ లోడ్ చేసేందుకు జెన్ కో అన్ని రకాల ఏర్పాట్లను చేసింది.

పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం నవయుగ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొంది.ఈ ఒప్పందాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేస్తూ రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. దీంతో నవయుగ కంపెనీ సెప్టెంబర్ 20వ తేదీన హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ నవయుగ కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 

సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులకు అనుకూలంగా ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను  ఆశ్రయించింది.నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై స్టేను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు మేఘా కంపెనీకి ఆటంకాలు లేకుండాపోయాయి.