చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు బతికేలా నిర్ణయాలు తీసుకున్నందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఉభయులకీ సామరస్యంగా వుండేలా నిర్ణయం తీసుకోవడం బాగుందని.. ప్రతిపాదనలు చూశాక మాకు చాలా సంతృప్తి వచ్చిందని చిరంజీవి వ్యాఖ్యానించారు.

కమిటీ నివేదికతో పాటు ఇండస్ట్రీ అభిప్రాయం సేకరించడానికి తొలుత తనను ఆహ్వానించారని ఏపీ సీఎం జగన్‌తో (ys jagan) అన్నారు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi). తర్వాత అందరం వచ్చి అభిప్రాయాలను చెప్పడానికి అవకాశం కల్పించినందుకు ఆయన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ కారణంగా సినిమా పరిశ్రమకు పెద్ద ఇబ్బంది వచ్చిందన్నారు మిగతా సినిమా పెద్దలు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు బతికేలా నిర్ణయాలు తీసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఉభయులకీ సామరస్యంగా వుండేలా నిర్ణయం తీసుకోవడం బాగుందని.. ప్రతిపాదనలు చూశాక మాకు చాలా సంతృప్తి వచ్చిందని చిరంజీవి చెప్పారు. మీరు తీసుకున్న నిర్ణయాల పట్ల ఎగ్జిబిటర్ల రంగం సంతోషంగా వుందని జగన్‌తో మెగాస్టార్ అన్నారు. పైరసీ, ఓటీటీ సినీ పరిశ్రమకు గొడ్డలి పెట్టని ఆయన చిరు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదో షో నారాయణమూర్తి ఎప్పటి నుంచో అడుగుతున్నారని సీఎంకు చిరు వివరించారు. అది మీ ముందు పెడితే మీరు ఒప్పుకున్నారని మెగాస్టార్ అన్నారు. 

జగన్‌తో భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడిందని చెప్పడానికి సంతోషిస్తున్నానని అన్నారు. సినీ పరిశ్రమ బాగోగులు కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. అన్ని వర్గాల సంతృప్తి కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. టాలీవుడ్ సినిమాలు దేశంలోనే పేరుగాంచాయని ఆయన గుర్తు చేశారు. చిన్న సినిమాలు ఐదవ షోకి కూడా ప్రభుత్వం అంగీకరించిందని చిరంజీవి చెప్పారు. ప్రజలు, సినీ పరిశ్రమ కూడా సీఎం జగన్ తీసుకొన్న నిర్ణయం పట్ల సంతృప్తి చెందుతారని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

సినిమా టికెట్ ధరలపై కొన్ని నెలలుగా ఉన్న అనిశ్చిత పరిస్థితులకు శుభం కార్డు పడిందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానని చిరంజీవి చెప్పారు. చిన్న సినిమాలకు కూడా మేలు చేకూరేలా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. చర్చలకు మమ్మల్ని ఆహ్వానించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. పాన్ ఇండియా సినిమాల విషయంలో ఏం చేయాలనే దానిపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని సీఎం చెప్పారని చిరంజీవి వివరించారు.

సినీ పరిశ్రమ తరపున ప్రభుత్వంతో చర్చలను నిర్వహించిన చిరంజీవికి తొలుత ధన్యవాదాలు చెబుతున్నానని ప్రముఖ నటుడు మహేష్ బాబు చెప్పారు. ఈ చర్చలతో తమందరికీ ఓ దారి చూపారని Mahesh Babu తెలిపారు.ఆరేడు నెలలుగా తెలుగు సినీ పరిశ్రమ గందరగోళంలో ఉందని చెప్పారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో సినీ పరిశ్రమకు పెద్ద రిలీఫ్ అని మహేష్ బాబు అభిప్రాయపడ్డారు.చిరంజీవితో పాటు ఈ విషయమై ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని కూడా చొరవ చూపారని మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. వారం లేదా పదిరోజుల్లో అందరూ శుభవార్త వింటారని మహేష్ బాబు చెప్పారు.

చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో పాటు నిర్మాతల సమస్యలను సీఎం జగన్ ఓపికగా విన్నారని ప్రముఖ దర్శకుడు రాజమౌళి చెప్పారు. సినిమా పరిశ్రమ ఎలా ముందుుకు వెళ్లాలనే దానిపై సీఎం జగన్ దిశా నిర్ధేశం చేశారని Rajamouli చెప్పారు. .సినీ పరిశ్రమ సమస్యలపై ఎటు వెళ్లాలనే దానిపై ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసినప్పటికీ చిరంజీవి ఈ అంశాన్ని తన భుజానికెత్తుకొని సక్సెస్ అయ్యేలా చేశారన్నారు.సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారని సినీ నటుడు ప్రభాష్ చెప్పారు.ఈ విషయమై చొరవ చూపిన చిరంజీవి, మంత్రి పేర్ని నానిలకు Prabhas ధన్యవాదాలు తెలిపారు.