జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు.. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక కాంట్రావర్సీ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. మొన్నటికి మొన్న గాంధీ, గాడ్సేలపై వివాదాస్పద కామెంట్స్ చేసిన ఆయన ఈ సారి.. రాజకీయాల్లో వేలు పెట్టారు.

టీడీపీ, చంద్రబాబులను టార్గెట్ చేస్తూ నాగబాబు కామెంట్స్ చేయడం గమనార్హం. కొన్ని మీడియా పత్రికలు చంద్రబాబుకి కవచాలుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇదంతా చూస్తుంటే.. ఒక్కోసారి వీరికి జగన్‌మోహన్‌రెడ్డిగారే కరెక్ట్ అనే డౌట్ వస్తోందేంటి అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.

 

‘టీడీపీ జెండాని అజెండాని మోస్తున్న కొన్ని తెలుగు వార్త చానెల్స్‌ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. టీడీపీ పార్టీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని, టీడీపీ పట్ల వాళ్లకున్న అనురాగం, మన వాడు చంద్రబాబు నాయుడు గారు అన్న అభిమానం, మన చంద్రబాబు కోసం ఎంతకయినా తెగించే సాహసం, మనబాబు కి ఉపయోగపడినంత కాలం ఓడ మల్లయ్య అని.. బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తున్నారు’అంటూ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో..‘ బాబోరి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ, బాబుగారి కి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు వావ్.. ఇది అసలైన వార్తా పత్రికల స్పిరిట్ అంటే..శభాష్...ఒక్కోసారి జగమ్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి కరెక్ట్ అని డౌట్ వస్తుందేంటి’అంటూ వరస ట్వీట్ల వర్షం కురిపించారు.