ఓడినవారిలో అత్యదికంగా పోలైన ఓట్లు కోకా సుబ్బారావు  రికార్డు బద్దలు 


రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్‌నాథ్‌ కోవింద్‌ విజయం సాధించినప్పటికి, ఓటమిలో రికార్డు నెలకొల్పిన ఘనత మాత్రం మీరాకుమార్ ఖాతాలో చేరింది. ప్రతిపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్థి బరిలోకి దిగిన ఆమె తెలుగువాడి పేరిట యాభై ఏళ్లుగా ఉన్న చరిత్రను తిరగరాసారు.


ఇప్పటివరకు రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచి, ఓటమిపాలైన వారిలో అత్యధిక ఓట్ల విలువ సాధించి ఆమె రికార్డును నెలకొల్పింది. తెలుగువాడైన కోకా సుబ్బారావు గతంలో ఈ ఘనత సాధించగా, ఇప్పుడు మీరాకుమార్‌ ఆ రికార్డును అధిగమించారు.


జాకీర్ హుస్సెన్ చేతిలో ఓటమిపాలైన సుబ్బారావుకు పోలైన ఓట్ల విలువ 3.63లక్షలుగా ఉంది.ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ మార్కును ఎవరూ అధిగమించలేకపోయారు. అయితే ఇటీవల వెలువడ్డ ఫలితాల్లో 3.67 లక్షల ఓట్ల విలువను సాధించి 50 ఏళ్ల రికార్డును మీరాకుమార్ చెరిపేశారు. దీంతో 1967లో సుబ్బారావు పేరిట ఉన్న అత్యధిక ఓట్ల విలువను అధిగమించినట్లయింది.