విశాఖలో కేరళకు చెందిన మెడికో ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం కలకలం రేపుతోంది. జీవితంలో ఓడిపోయానంటూ ఓ సూసైడ్ నోట్ రాసి లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

విశాఖలో కేరళకు చెందిన మెడికో ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం కలకలం రేపుతోంది. జీవితంలో ఓడిపోయానంటూ ఓ సూసైడ్ నోట్ రాసి లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. దాబా గార్డెన్స్‌లోని ఓ లాడ్జిలో కేరళ మెడికో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని రమేశ్ కృష్టగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.