విశాఖపట్నంలో ఓ అపార్టమెంట్ మీదినుంచి పడి మెడికల్ విద్యార్థి ఒకరు మృతి చెందాడు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎండాడలోని ఓ అపార్ట్మెంట్ నుంచి పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘోరమైన ఘటన వైశాఖి స్కైలైన్ లో చోటు చేసుకుంది. గోగినేని గిరితేజ మెడికల్ విద్యార్థి. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతను అపార్ట్మెంట్ పైనుంచి పడి మృతి చెందాడు. గిరితేజ గీతం కాలేజీలో చదువుకుంటున్నారు. వైశాఖి స్కైలైన్ లోని బి బ్లాక్ లోని అపార్ట్మెంట్ పైనుంచి కిందపడిపోయాడు. దీంతో గిరితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన అరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మృతుడు గిరితేజ సీతమ్మధారలో నివసిస్తాడని గుర్తించారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను, ప్రమాదానికి గల కారణాలను వెతుకుతున్నారు. గిరితేజ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఇదిలా ఉండగా, నవంబర్ లో ర్యాగింగ్ పైశాచిక క్రీడకు ఓ యువకుడు బలయ్యాడు. ర్యాగింగ్ ప్రమాదం అని దానికి దూరంగా ఉండాలని విద్యార్థులకు ఎంతగా చెప్పినా.. అక్కడక్కడా అది జడలు విప్పుతూనే ఉంది. తాజాగా అస్సాం లోని డిబ్రూగఢ్ యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సీనియర్లు ర్యాగింగ్ పేరుతో పెడుతున్న టార్చర్ భరించలేక.. ఓ విద్యార్థి నిస్సహాయ పరిస్థితుల్లో దారుణమైన ఘటనకు తెగించాడు. ర్యాగింగ్ ను తప్పించుకునే క్రమంలో రెండో అంతస్తు మీది నుంచి దూకేసాడు. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన సిబ్బంది, మిగతా విద్యార్థులు వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
రంగా హత్యకు కారణమైన వాళ్లే ఆయన ఫొటోకు దండలు వేస్తున్నారు: కొడాలి నాని సంచలన కామెంట్స్
గాయపడిన విద్యార్థిని ఆనంద్ శర్మ గుర్తించారు. శివసాగర్ జిల్లా అమ్గూరి వాసి అని తేలింది. ఆనంద్ శర్మ డిబ్రూగఢ్ యూనివర్సిటీలో ఎంకాం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గత వారం రోజులుగా సీనియర్లు ర్యాగింగ్ పేరుతో తన కొడుకును వేధిస్తున్నారని ఆనంద్ శర్మ తల్లి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి కూడా వారంతా కలిసి తన కొడుకును 80 చెంపదెబ్బలు కొట్టారని తెలిపింది. చంప దెబ్బలతో ఆగకుండా బాటిల్స్, కర్రలతో కొడుతూ టార్చర్ చేశారని చెప్పింది. దాన్ని తన కొడుకు భరించలేకపోయాడు.. దాని నుండి తప్పించుకోవడానికి బిల్డింగ్ మీద నుంచి దూకే అని.. ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే ఈ విషయం తమకు ముందే తెలిసి హాస్టల్ వార్డెన్ కి ఫిర్యాదు చేశామని.. అయితే ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని.. అప్పుడే పట్టించుకుంటే ఇంత పరిస్థితి రాకపోయేది అని ఆనందశర్మ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన మీద విచారణ చేపట్టారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జితెన్ హజారికా తెలిపారు. ఈ దారుణానికి కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
