దుర్గ ఆలయంలో మీడియాపై మరోసారి ఆంక్షలు ఘాట్ రోడ్డులో రాకపోకలు పూర్తిగా నిషేధం
దుర్గ గుడి విషయంలో మీడియాపై ఆంక్షలు ఇప్పట్లో తొలగిపోయేలా లేవు. దుర్గ గుడి ఈఓ సూర్యకుమారికి, మీడియాకి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆమె ఈఓ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి.. ఆమె మీడియాపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. ఆలయంలో శాస్త్రోక్తంగా జరగాల్సిన కొన్ని పనుల విషయంలోనూ వివాదం నెలకొన్న సందర్భాలు ఉన్నాయి. వాటిని మీడియా ఫోకస్ చేయడం సూర్యకుమారికి నచ్చడం లేదు. దీంతో ఆమె మీడియాపై పలుమార్లు ఆంక్షలు విధించగా.. తాజాగా మరిన్ని ఆంక్షలు విధించారు.
దుర్గగుడి ఘాట్ రోడ్డు లో గ్రీనరి విషయాన్ని మీడియా ప్రతినిధులు .. మంత్రి దేవినేని ఉమా దృష్టి కి తీసుకువెళ్లడం పై ఆయల ఈఓ సూర్య కుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆలయ అధికారుల నుంచి మీడియాకు ఆంక్షలు మొదలయ్యాయి.
ఆలయం గురించి ఎలాంటి సమాచారం, ఇంటర్వ్యూలు ఇవ్వదంటూ ఈఓ అధికారులకు తెలిపారు. విలేకరులు తమ ద్విచక్ర వాహనాలను శివాలయం క్రింద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు పార్క్ చేసుకొని లీఫ్ట్ లో పై కి వెళ్ళాలని ఆమె తెలిపారు.
ఘాట్ రోడ్డులో కి విలేకరులు పూర్తిగా నిషేధం విధించారు. ఆలయ ప్రవేశానికి సంబంధించిన పాస్ ల మీద పార్కింగ్ ప్లేస్ తో స్టాంప్ వేసి మరి జారీ చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులు ప్రెస్ మీట్ లు పెట్టిన ప్పుడు విలేకరులు మాలికార్జున మండపం లో ని లిఫ్ట్ ద్వారా క్రింది దిగి నడుచుకుంటూ కమాండ్ కంట్రోల్ రూమ్ కు రావాలని ఆమె చెప్పారు.
సూర్యకుమారి ఈఓ గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో అమ్మవారి ఊరేగింపులో విగ్రహాన్ని అపసవ్య దిశలో ఏర్పాటు చేశారంటూ జరిగిన వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది.. దీనిపై మీడియాతో ఆమెకు పెద్ద వాగ్వివాదామే నెలకొంది. ఆలయంలో జరుగుతున్న తప్పులను వెత్తి చూపుతారనే కారణంతో ఆమె మీడియాపై పలు ఆంక్షలు విధిస్తూ వస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ విషయంలో మీడియా కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే.. ఈఓ బాగానే ఉన్నారు.. మీడియా కూడా బాగానే ఉంది.. కానీ ఆలయ పరువే కృష్ణా నదిలో కలిసిపోతోంది.
