మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ : ‘నోట్ల రద్దుతో డబ్బులు ఇరుక్కుపోయాయి...’ మెసేజ్ తో యువతికి రూ. 32 లక్షల టోకరా..
ఓ మహిళకు Matrimony site లో పరిచయమైన ఓ వ్యక్తి.. ఆమెను ప్రేమలోకి దించాడు. అయితే చివరికి వారి కథ ఎంతవరకు వెళ్లిందంటే... గుంటూరు జిల్లా సత్తెనపల్లి కి చెందిన ఓ మహిళ అబ్బూరు లోని ఓ Bankలో పని చేస్తుంది. ఆమెకు అంతకు ముందే పెళ్లి అయ్యింది.
గుంటూరు : యువతులను ముగ్గులోకి దించేందుకు కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకొందరు ఏవేవో అబద్ధాలు చెప్పి, నమ్మించి చివరికి ప్రేమాయాణం మొదలు పెడతారు. ఈ క్రమంలో యువతుల నమ్మకాన్ని కొందరు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. మరికొందరు మాత్రం స్వచ్ఛమైన మనసుతో ప్రేమించి, చివరికి వారినే పెళ్లి చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన దీనికి భిన్నంగా, విచిత్రంగా ఉంది.
ఓ మహిళకు Matrimony site లో పరిచయమైన ఓ వ్యక్తి.. ఆమెను ప్రేమలోకి దించాడు. అయితే చివరికి వారి కథ ఎంతవరకు వెళ్లిందంటే... గుంటూరు జిల్లా సత్తెనపల్లి కి చెందిన ఓ మహిళ అబ్బూరు లోని ఓ Bankలో పని చేస్తుంది. ఆమెకు అంతకు ముందే పెళ్లి అయ్యింది. ఏవో కారణాలతో వారి వివాహం రద్దు అయ్యింది. దీంతో రెండో పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న ఆమెకు ఒక మాట్రిమోనియల్ సైట్ లో కార్తీక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
తాను చెన్నై ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నానని, డబ్బులు బాగా సంపాదించానని పెళ్లి చేసుకుంటానని మెసేజ్ చేశాడు. అతని మాటలు గుడ్డిగా నమ్మిన మహిళ అతనితో పరిచయం పెంచుకుంది. రోజూ అతనితో Chatting చేసేది. ఆ తర్వాత వారి సంభాషణ చాటింగ్ నుంచి ఫోన్ కి మారింది. రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఇద్దరూ బాగా దగ్గరయ్యారు. ఎంతగా అంటే అతను చెప్పేది ఎలాంటి విషయం అయినా సరే ఆమె బాగా నమ్మేంతగా.. అలా నడుస్తున్న క్రమంలో...కొన్ని రోజుల తర్వాత అతడి నుంచి మళ్ళీ ఓ మెసేజ్ వచ్చింది.
YS Viveka Murder: వివేకా రక్తపుమరకల వెనకున్నది రక్తసంబంధీకులే...: టిడిపి అనురాధ సంచలనం
తనకున్న ఆస్తులను Cancellation of notes సమయంలో అమ్మేశానని, కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉన్నాయని చెప్పాడు. దీనిమీద మరికొంత సమాచారం ఇస్తూ చక్కగా నమ్మించాడు. అంతేకాదు IT executives నిలిపివేయడంతో డబ్బులు తీసుకోలేకపోతున్నానని చెప్పాడు. వారికి కొంత మొత్తం ముట్టచెబితే.. తన డబ్బు అంతా తనకు తిరిగి వస్తుందని తెలిపాడు. అంతేకాదు ఈ విషయాన్ని నేరుగా మాట్లాడడానికి మొహమాటపడి ఇలా మెసేజ్ చేస్తున్నానని చెప్పొకొచ్చాడు.
ఈ విషయాన్ని చాలా నమ్మకంగా చెప్పడంతో.. ఆ యువతి అతడి మాటలు నమ్మి 32 లక్షల రూపాయలు పంపించింది. అయితే డబ్బులు అతనికి అందిన తరువాతే అసలు ట్విస్ట్ మొదలయ్యింది. సదరు ప్రేమికుడు రెస్పాండ్ అవ్వడం మానేశాడు. ఆ వ్యక్తి నుంచి మెసేజ్ లకు, ఫోన్ కాల్ లకు ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో విసిగిపోయిన ఆ యువతి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిమీద వారు ఆరా తీశారు.
మహిళను మోసం చేసిన వ్యక్తి పేరు మహారాజ్ జానీ రెక్స్ అని, అప్పటికే అతనికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. పైగా ఇలాంటి మోసాలు చేసేందుకు నిందితుడి భార్య కూడా సహకరిస్తుందని తెలుసుకుని అంతా షాకయ్యారు. కేసు దర్యాప్తులో ఉంది.