Asianet News TeluguAsianet News Telugu

ఫైబర్ గ్రిడ్: చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా?

  • ఫైబర్ గ్రిడ్ ను అమలు చేయటం ద్వారా చంద్రబాబునాయుడు మాస్టర్ ప్లానే వేసారు.
  • చంద్రబాబు ప్లాన్ గనుకు సక్సెస్ అయితే వచ్చే ఎన్నికలకు ముందు వైసీపీతో పాటు ఏ ప్రతిపక్షం పేరు గానీ బొమ్మ గానీ టివిల్లో కనబడదు,
  • టిడిపికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయన్న కారణంగా కొన్ని ప్రాంతాల్లో సాక్షి, ఎన్టీవీ ప్రసారాలను ఆపేసిన విషయం అందరూ చూసిందే.
Master plan behind naidus fiber grid mission

ఫైబర్ గ్రిడ్ ను అమలు చేయటం ద్వారా చంద్రబాబునాయుడు మాస్టర్ ప్లానే వేసారు. చంద్రబాబు ప్లాన్ గనుకు సక్సెస్ అయితే వచ్చే ఎన్నికలకు ముందు వైసీపీతో పాటు ఏ ప్రతిపక్షం పేరు గానీ బొమ్మ గానీ టివిల్లో కనబడదు, వినబడదు. ఇంతకీ ఫైబర్ గ్రిడ్ కథ ఏమిటి? ఈ గ్రిడ్ అన్నది చంద్రబాబు కలల ప్రాజెక్టు. దీనిద్వారా అత్యంత చవకగా టెలిఫోన్, కేబుల్ టివి, ఇంటర్నెట్ తదితరాలను జనాలకు అందిచనున్నట్లు సిఎం ఎన్నోసార్లు చెప్పారు.

చంద్రబాబు చెబుతున్నదంతా నిజమేనా? ఇక్కడే ముఖ్యమంత్రి పెద్ద ప్లానే వేసినట్లు సమాచారం. అదేంటంటే, ఇంటర్నెట్, టెలిఫోన్ సంగతి పక్కనబెడితే సమస్య అంతా కేబుల్ టివి దగ్గరే వస్తోంది. ఎన్నికల ప్రచారం ఊపందుకునే లోపలే ఫైబర్ గ్రిడ్ అమల్లోకి వస్తే చంద్రబాబు, టిడిపి తప్ప ఇంకే ఇతర పార్టీల మొహాలు కూడా కనబడవు. ఎలాగంటే, టిడిపికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయన్న కారణంగా కొన్ని ప్రాంతాల్లో సాక్షి, ఎన్టీవీ ప్రసారాలను ఆపేసిన విషయం అందరూ చూసిందే. టిడిపి ఎంఎల్ఏలు, నేతల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వార్తలు కనబడటం లేదు. స్ధానిక కేబుల్ ఆపరేటర్లను బెదిరించి మరీ ఛానళ్ళను తొక్కిపెడుతున్నారు.

రేపు గనుక ఫైబర్ గ్రిడ్ అమల్లోకి వస్తే రాష్ట్రంలోని కేబుల్ టీవీలన్నీ పడుకోవాల్సిందే. ఎలాగంటే, కేబుల్ టీవీ ఆపరేటర్లు (ఎంఎస్ఓ) గనుక టిడిపి నేతలు చెప్పినట్లు వినకపోతే వారికీ ఇబ్బందులు మొదలవుతాయి.  కాబట్టి వారు చెప్పినట్లు వింటారు. దాంతో వైసీపీతో పాటు ఇతర ప్రతిపక్షాల గొంతు వినబడదు. అంటే ఎన్నికల సమయంలో ఏ ఇంట్లో చూసినా చంద్రబాబు, టిడిపి తప్ప ఇంకో మొహమే కనబడదు. డిటిహెచ్ కనెక్షన్ ఉన్న ఇళ్ళకు మినహాయింపు ఉంటుందనుకోండి అది వేరే సంగతి. కానీ డిటిహెచ్ కనెక్షన్లు ఉన్న ఇళ్ళ సంఖ్య ఎంత?

ఇదే విషయమై వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇదే విషయమై కోర్టులొ కేసు వేసారు. రాష్ట్రప్రభుత్వాలకు టీవీ ప్రసారాలను నియంత్రించే అధికారాలు లేవని ఆళ్ళ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. చంద్రబాబు ప్రయత్నాలు ట్రాయ్, ప్రసారభారతి నిబంధనలను ఉల్లంఘించటమేనంటూ పిటీషన్లో ఆళ్ళ స్పష్టగా పేర్కొన్నారు. మరి, కోర్టు ఏం చేస్తుందో చూడాలి.