ప్రకాశం జిల్లాలో ఓ బట్టల షాపులో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. 

ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బట్టల షాపులో చెలరేగిన మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటలు తీవ్ర స్థాయిలో చెలరేగుతుండడంతో పొగ భారీగా కమ్ముకుంది. అగ్నిప్రమాదం సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. షార్ట్స సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం అని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.