పెళ్లైన ఆరునెలలకే ఓ వివాహిత తనువు చాలించింది. ఆమెచావుకు కారణం ఏంటో తెలుసుకోవాల్సిన గ్రామ పెద్దలు.. అత్తింటి వారిచే యువతి తల్లిదండ్రులకు రూ.4లక్షలు నష్ట పరిహారంగా ఇప్పించారు. ఈ దారుణ సంఘటన విశాఖలో చోటుచేసుకుంది..

పూర్తి వివరాల్లోకి వెళితే...విశాఖలోని మధురవాడకు చెందిన కీర్తన కు అదే ప్రాంతానికి చెందిన యువకుడితో 2018లో వివాహం జరిగింది. కీర్తన తన భర్తతో కలిసి బక్కన్నపాలెం ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటుంది.  ఆరు నెలలపాటు వీరి సంసారం బాగానే సాగింది. కాగా.. ఇటీవల కీర్తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.

దీంతో.. కీర్తన తల్లిదండ్రులు.. భర్త, అత్తమామలే  తమ కుమార్తెను చంపేశారంటూ ఆరోపించారు. దీనిపై పంచాయితీ పెట్టిన గ్రామస్థులు.. రూ.4లక్షలు కీర్తన తల్లిదండ్రులకు ఆమె భర్త చేత ఇప్పించారు. అనంతరం నడుము నొప్పి భరించలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వారి తల్లిదండ్రుల చేతనే పోలీసులకు చెప్పించడం విశేషం. పోలీసులు కూడా ఆత్మహత్య కా కేసు నమోదు చేశారు.