విజయవాడలో దారుణం జరిగింది. ఇల్లు ఖాళీ చేయమన్నారన్న మనస్తాపంతో వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమెకు ఆల్రెడీ ఫిట్స్ కూడా ఉండడంతో మృతిని అనుమానాస్పద మరణంగా పోలీసులు భావిస్తున్నారు.

"

వివరాల్లోకి వెడితే విజయవాడ నగర శివారు కండ్రికలో సుధ అనే వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అద్దె చెల్లించలేదని ఇంటి యజమాని సామాన్లను రోడ్డుపై పడేసిన కారణంగా... మనస్థాపానికి గురై సుధ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

సుధ భర్త లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఘటన జరిగిన సమయంలో లారీలో వేరే రాష్ట్రానికి వెళ్లడంతో పోలీసులు అతనికి సమాచారం అందించారు. అయితే సుధ తల్లి స్థానికంగా దగ్గర్లోనే ఉంటుందని, కాకపోతే సరిగా పట్టించుకోదని సమాచారం. 

సుధకు మూర్చ రోగం ఉండడం, ఆర్థిక ఇబ్బందులు, పట్టించుకునేవాళ్లు లేకపోవడం దీనికి తోడు ఇల్లు ఖాళీ చేయమనడంతో ఏం చేయాలో అర్థం కాక ఇలా ఆత్మహత్య కు పాల్పడి ఉంటుందని స్ధానికులు చెపుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన నున్న గ్రామీణ పోలీసులు విచారిస్తున్నారు.