విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా కోటవురట్ల మండలం యండపల్లిలో శుక్రవారం అర్థరాత్రి ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఆమెతో సంబంధం పెట్టుకున్న యువకుడే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లిడంచారు. 

కోటవురట్ల మండలం కైలాసపట్నానికి చెందిన పేరూరి రమాదేవి (26)కి తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన దుర్గాప్రసాద్ తో ఎనిమిదేల్ల క్రితం పెళ్లయింది. వారికి జోసఫ్ (7), జస్సీ ప్రియాంక (6) అనే ఇద్దరు పిల్లలున్నారు. 

రమాదేవి నర్సీపట్నంలోని ఓ హోటల్లో సర్వర్ గా పనిచేస్తోంది. ఆ సమయంలో సుంకపూర్ కు చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ విషయం తెలిసిన దుర్గాప్రసాద్ భార్యను మందలించాడు. ఆ విషయంపై తరుచుగా గొడవ పడుతూ వచ్చాడు.

భర్త డ్యూటీకీ వెళ్లిన సమయంలో ఆ యువకుడు ఇంటికి వచ్చేవాడని అంటున్నారు. దుర్గాప్రసాద్ డ్యూటీకి వెళ్లిపోవడంతో శుక్రవారం రాత్రి 2.30 గంటల సమయంలో యువకుడుి రమాదేవి ఇంటికి వచ్చాడని, అతను ఆమెతో గొడవ పడ్డాడని చెబుతున్నారు. 

యువకుడే మహిళను హత్య చేసి ఉంటాడని సీఐ శ్రీనివాస రావు చెప్పారు. డ్యూటీకి వెళ్లిన దుర్గాప్రాసాద్ బంధువులు ఫోన్ చోయడంతో రాజమండ్రిలో ఉన్న ఆయన శనివారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. కేసు నమోదు చేసి, రమాదేవి శవాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.