విశాఖపట్నంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలీసు స్టేషన్‌లో దంపతులకు ఎస్సై కౌన్సిలింగ్‌ ఇస్తున్న సమయంలోనే.. భార్య ఆత్మహత్యకు పాల్పడింది. 

విశాఖపట్నంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలీసు స్టేషన్‌లో దంపతులకు ఎస్సై కౌన్సిలింగ్‌ ఇస్తున్న సమయంలోనే.. భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్లి పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. విశాఖపట్నంకు చెందిన వినయ్‌కు గుంటూరుకు చెందిన శ్రావణితో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే శ్రావణి.. బుధవారం ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దీంతో పోలీసులు భార్యభర్తలు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు స్టేషన్‌కు పిలించారు. ఎస్సై శ్రీనివాస్ కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో.. ఫోన్‌లో మాట్లాడుతూ బయటకు వెళ్లిన శ్రావణి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంటలు అర్పేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన శ్రావణిని పోలీసులు మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శ్రావణి మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయితే కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో భర్తతో మాట్లాడుతుండగా శ్రావణి బయటకు వెళ్లినట్టుగా చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.