సౌభాగ్యం కోసం నోములు నోచి.. ఆ తరువాత ప్రియుడితో కలిసి భర్తను హతమర్చి... ఓ భార్య దారుణం...

పాలు తీసుకుళ్లే ఆటో డ్రైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను పక్కా ప్లాన్ తో హతమార్చింది. ఆ తరువాత నగల కోసం దొంగల పని అంటూ నాటకానికి తెరలేపింది.

married woman assassinated husband over extra marital affair in chittoor

చిత్తూరు : కట్టుకున్న భార్యే భర్త పాలిట కాల యముడిలా మారింది. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసి తెలివిగా అంతమొందించింది. ఆ తరువాత ఏమీ తెలియనట్టుగా బంగారు నగల కోసం దొంగలు హత్య చేశారంటూ పోలీసులతో ఫిర్యాదు డ్రామా ఆడింది. నియోజకవర్గంలోని పెద్ద పంజాణి మండలం, తుర్లపల్లి సమీపంలో సోమవారం రాత్రి దామోదర్ (25) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

పెద్ద పంజాణి మండలం, పెనుగొలకలకు చెందిన చంద్రమోహన్ కుమార్తె అనురాధ, పుంగనూరు మండలం బత్తలాపురానికి చెందిన రెడ్డెప్ప కుమారుడు దామోదర్ తో ఏడాది క్రితం వివాహం జరిగింది. అత్తారింట్లో నోముల పండుగకు దంపతులు వచ్చి స్వగ్రామానికి బైక్ మీద భార్యభర్తలు తిరుగు ప్రయాణంలో దామోదర్ ను కత్తులతో పొడిచి చంపారు. అయితే, కళ్లలో కారంపొడి కొట్టి దొంగలు నగల కోసమే హత్య చేశారంటూ మృతుని భార్య అనురాధ పోలీసులకు తెలిపింది. 

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భవతిని చేసి.. వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం.. పోలీసులకు ఫిర్యాదు...

అందరూ ఆమె చెప్పింది నిజేమనని అనుకున్నారు. అయితే, ఆమె తండ్రి గ్రామంలో పాల సెంటర్ నడుపుతుండేవాడు. అక్కడికి పాలు తీసుకెళ్లేందుకు పెద్దపంజాణి మండలం, తిరుమల కొండయ్య గారిపల్లికి చెందిన గంగరాజు (25) పాల ఆటో డ్రైవర్ గా వచ్చేవాడని తెలిసింది. అప్పటినుంచే అనురాధ, గంగరాజు మధ్య చనువుందని సమాచారం. వీరికి భర్త అడ్డుగా ఉండడంతో పక్కా స్కెచ్ తో ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. అనురాధ ఇచ్చిన సమాచారంతోనే గంగరాజు దారి మధ్యలో వేచి ఉండి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు మృతిని భార్య అనురాధ, పాల ఆటో డ్రైవర్ గంగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడిందని సమాచారం. కేసులో పూర్తి వివరాలు తెలిశాక నిందితులను నేడో, రేపో పోలీసులు అరెస్ట్ చూపనున్నట్లు తెలిసింది. 

ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ లో భర్త సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ దారుణానికి తెగించింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతేర్చింది. ఆ తరువాత భర్త మృతదేహాన్ని ఇంటిముందున్న గడ్డివాములో దాచింది. ఏడాదిన్నర పాటు గడ్డివాములోనే ఉంచిన తరువాత అస్తిపంజరాన్ని తీసుకెళ్లి అడవిలో పడేసింది. ఆ అస్తి పంజరమే ఆ మహిళను పోలీసులకు పట్టించింది. చివరకు ఆ మహిళ నిజం అంగీకరించి కటకటాల పాలయ్యింది. మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రేవా జిల్లాలోని మౌగంజ్ లో నివసించే రామ్ సుశీల్ (40) పదేళ్ల క్రితం రంజన అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేరు. నాలుగేళ్ల క్రితం సుశీల్ సోదరుడు గులాబ్ తో రంజన వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరి హద్య శారీరక సంబంధం ఏర్పడింది. ఆ విషయం తెలుసుకున్న సుశీల్.. భార్యను నిలదీశాడు. దీంతో రంజన, గులాబ్ కలిసి ఓ పథకం వేశారు. సుశీల్ ను చంపేసి అతని వాటా ఆస్తిని కూడా తామే అనుభవించాలనుకున్నారు. ఏడాదిన్నర క్రితం రామ్ సుశీల్ హత్యకు గురయ్యాడు. 

రంజన సమోసాలో ఎలకల మందు కలిపి భర్త చేత తినిపించింది. అది తిన్న కొద్దిసేపటికే సుశీల్ మృతి చెందాడు. గులాబ్ తో కలిసి సుశీల్ మృతదేహాన్ని ఇంటిముందు ఉన్న గడ్డి వాము మధ్యలో రంజన దాచింది. ఏడాదిన్నర తరువాత గడ్డివాములో అస్తిపంజరం మాత్రమే ఉండడం చూసి దానిని తీసుకువెళ్లి అడవిలో పారేశారు. కొద్ది రోజుల తరుాత అడవిలో అస్తి పంజరం గురించి పోలీసులకు సమాచారం అందింది. వారు ఆ అస్తిపంజరానికి డీఎన్ఏ టెస్ట్ చేయించారు. 

అనంతరం చుట్టు పక్కల ప్రాంతాల్లో విచారించడం ప్రారంభించారు. మౌగంజ్ గ్రామంలో విచారించగా సుశీల్ అనే వ్యక్తి ఏడాదిన్నర నుంచి కనిపంచడం లేదని బయటపడింది. గ్రామ ప్రజల ద్వారా రంజన, గులాబ్ వివాహేతర సంబంధం గురించి పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు రంజనను అదుపులోకి తీసుకుని విచారించారు. తాను, గులాబ్ కలిసి సుశీల్ ను చంపినట్టు ఆమె అంగీకరించింది. దీంతో వారిద్దరినీ పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios