అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని సోమందేపల్లి మండలం మండ్లి గ్రామంలో పెళ్లి వేడుకలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. పెళ్లి భోజనం తిని ఆరుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఏడు మంది పెద్దలకు వాంతలు, విరోచనాలను అధికమవడంతో అర్థరాత్రి సమయంలో వెంటనే హిందూపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.