Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుపై దాడి గుర్తులేదా.. పద్ధతి మార్చుకో : మంత్రి అప్పలరాజుకు మావోయిస్టుల వార్నింగ్

ఏపీ మంత్రి అప్పలరాజుకు మరోసారి మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు వుంటాయని మావోలు పేర్కొన్నారు.  దోపిడీలకు, దౌర్జన్యాలకు పాల్పడుతోన్న ఏ రాజకీయ పార్టీ అయినా మావోయిస్టులకు ఒకటేనని లేఖలో స్పష్టం చేశారు.
 

maoist warning letter to minister seediri appalaraju
Author
First Published Oct 13, 2022, 8:56 PM IST

ఏపీ మంత్రి అప్పలరాజుకు మరోసారి మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు వుంటాయని మావోలు పేర్కొన్నారు. పేదల భూములను కబ్జా చేసే అనుచరులను అదుపులో వుంచాలని వారు మంత్రిని హెచ్చరించారు. ఏవోబీ కమిటీ వైవీఎస్ కార్యదర్శి అశోక్ పేరుతో లేఖను విడుదల చేశారు. మంత్రికి వత్తాసు పలుకుతున్న రెండు పత్రికల యాజమాన్యాలు కూడా పద్దతిని మార్చుకోవాలని మావోయిస్టులు హెచ్చరించారు. మావోయిస్టు ప్రజా సంఘాల నాయకులుగా చెలామణి అవుతోన్న వారు మంత్రికి లోపాయికారిగా సలహాలు ఇవ్వడం మానేయాలని హితవు పలికారు. 

ALso Read:భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో ఎదురుకాల్పులు.. ఇద్ద‌రు మావోయిస్టులు హ‌తం

చంద్రబాబుపై అలిపిరిలో దాడి, ఎర్రంనాయుడుపై దాడి, హోంమంత్రి మాధవరెడ్డిని అంతమొందించిన విషయాలు కొందరు తెలియక మాట్లాడుతున్నారనంటూ మావోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీలకు, దౌర్జన్యాలకు పాల్పడుతోన్న ఏ రాజకీయ పార్టీ అయినా మావోయిస్టులకు ఒకటేనని లేఖలో స్పష్టం చేశారు. ప్రజలకు క్షమాపణ చెబితే చరిత్ర క్షమిస్తుంది.. లేదంటే చరిత్రలో ప్రజా శత్రువులకు పట్టిన గతే వీరికి పట్టకమానదని మావోయిస్టులు హెచ్చరించారు. అయితే దీనిపై మంత్రి అప్పలరాజు స్పందించారు. మావోయిస్టుల లేఖలోని అంశాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒక అసమ్మతి నేత తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అప్పలరాజు ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios