ప్రేమికుల జంట నిర్మానుష ప్రదేశానికి వెళ్లడం గమనించిన ఓ గంజాయి బ్యాచ్ వారికి తెలియకుండా వెంబడించింది. యువకుడిని బంధించి,యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. 

గంజాయి మత్తులో కొందరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. ఓ యువతిపై అత్యాచారయత్నం చేశారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించి, కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చూసిన యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.

అమరావతి రైతుల సంచలన నిర్ణయం.. పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్.. కారణమిదే..

వివరాలు ఇలా ఉన్నాయి. గన్నవరం మండలం ముస్తాబాద్ ఓ ప్రేమజంట సరదాగా ఏకాంతంగా గడుపుదామని ఓ నిర్మానుష ప్రదేశానికి వెళ్లింది. దీనిని ఓ గంజాయి బ్యాచ్ గమనించింది. వెంటనే వారి వెనకాల ఆటోలో వెళ్లారు. ఓ ప్రాంతంలో ఉన్న యువకుడి తాళ్లతో కట్టేశారు. అనంతరం ఆ యువతిని అత్యాచారం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. గట్టిగా అరిచింది. 

హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టివేత.. మునుగోడు ఉపఎన్నిక కోసమేనా..?

ఆమె అరుపులు వినిపించడంతో చుట్టుపక్కల ఉండే ప్రజలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారిని గమనించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే స్థానికులు వారిని వెంబడించారు. నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. అతడిని పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో నిందితులు ఉపయోగించిన ఆటోను పోలీసులు గమనించారు. అందులో గంజాయి ఉందని నిర్ధారించుకున్నారు. అయితే ఈ ఘటనలో బాధిత ప్రేమ జంటను స్థానికులు, పోలీసులు హాస్పిటల్ కు తరలించారు.