గుంటూరు: గుంటూరు జిల్లాలోని రమావత్ మంత్రూబాయిని అప్పు తీర్చనందుకు గాను  వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ట్రాక్టర్ తో తొక్కించి చంపారు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. 

మూడేళ్ల క్రితం బోనముక్కల శ్రీనివాస్ రెడ్డి వద్ద మంత్రూబాయి దంపతులు పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకొన్నారు.  బోనముక్కల శ్రీనివాస్ రెడ్డి వద్ద మంత్రూభాయి దంపతులు రూ. 3.30 లక్షలు అప్పు తీసుకొన్నారు. 

అప్పు తీర్చనందుకు గాను  ఇవాళ పొలంలోనే ట్రాక్టర్ తో శ్రీనివాస్ రెడ్డి తొక్కించాడు. నర్సింగపాడులో  శ్రీనివాస రెడ్డి  వైసీపీ నేతగా ఉన్నారు. ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ అప్పును చెల్లించాలని మంత్రూబాయి దంపతులను శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే మంత్రూబాయి దంపతులు అప్పు చెల్లించలేకపోయారు. అయితే ఇవాళ డబ్బులు చెల్లించలేదనే కోపంతో  ఆమెను ట్రాక్టర్ తో తొక్కించాడు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.